ప్రీప్లాన్డ్ గా సమంతను సైడ్ చేసిన నాగచైతన్య?
అక్కినేని నాగచైతన్య-సమంత జంట ఎంతో బాగుంటుందని అక్కినేని అభిమానులతోపాటు సినీ ప్రియులంతా ముచ్చటపడ్డారు. వారిద్దరూ విడాకులు తీసుకోవడం వీరందరినీ షాక్ కు గురిచేసినప్పటికీ ఎప్పటికైనా తిరిగి కలవబోతారా? అనే ఆశతో ఎదురుచూశారు. అయితే నాగచైతన్య తాజాగా శోభితతో నిశ్చితార్థం చేసుకోవడంతో చైతూ, సామ్ శాశ్వతంగా దూరమైనట్లవుతోంది. సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి కొద్దిరోజులు ముందుగానే ఇన్ స్టాగ్రామ్ లో చైతూను అన్ ఫాలో చేయడంతోపాటు పెళ్లి ఫొటోలను కూడా తొలగించింది. అంతేకాదు.. తన ప్రొఫైల్ పేరును కూడా మార్చింది.
ఎక్కడా మాట్లాడలేదు
అయితే నాగచైతన్య మాత్రం ఇన్ స్టాలో సమంతను అన్ ఫాలో చేయలేదు. ఫొటోలను తీసేయలేదు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను అలాగే ఉంచాడు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంతను ఫాలో అయ్యేవాడు. బయట కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో ఎక్కడా చైతూ సమంత గురించి ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. సినీ ప్రియులంతా ఇది చూసి నాగచైతన్య చాలా మంచివాడని, సమంత అనవసరంగా ఆవేశపడిందంటూ వ్యాఖ్యలు చేసేవారు. సమంత గురించి వ్యతిరేక వార్తలు రాస్తుండటంతో కొన్ని మీడియా సంస్థలపై కోర్టులో సమంత కేసు వేసింది. కానీ చివరకు విసిగిపోయి ఎన్ని కామెంట్లు వస్తున్నప్పటికీ పట్టించుకోలేదు.

సానుభూతి కోసం డ్రామా
తాజాగా శోభిత ధూళిపాలతో నాగచైతన్య నిశ్చితార్థం ఈనెల ఎనిమిదో తేదీన జరిగింది. అదేరోజు నాగచైతన్య ఇన్ స్టాగ్రామ్ లో సమంతను అన్ ఫాలో చేయడంతోపాటు సమంతో తన పెళ్లి ఫొటోలను కూడా తొలగించాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. నాగచైతన్య ఇన్నిరోజులు మంచివాడిగా నటించాడని, సానుభూతి కోసమే అతను ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, ఇప్పుడు శోభితతో నిశ్చితార్థం జరిగిన తర్వాత వీటిని తొలగించడం అంటే ఇన్నాళ్లు అమాయకుడిగా నటించాడని, ప్రీప్లాన్డ్ గా సానుభూతిని రాబట్టుకున్నాడంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే సమంతతో వివాహ బంధంలో ఉన్నప్పటికీ అప్పటికే శోభితతో రిలేషన్ లో ఉండేవాడని అర్థమవుతోందంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications