అలా అయితేనే పెళ్లి జరుగుతుంది.. లేదంటే విడిపోదాం: శోభితకు చెప్పిన నాగచైతన్య
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఈనెల నాలుగోతేదీన అన్నపూర్ణ స్టూడియోలో శోభిత ధూళిపాళను ఘనంగా వివాహం చేసుకున్నారు. 300 మంది అతిథుల మధ్య నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకల తర్వాత ఈ జంట తొలిసారిగా అనురాగ్ కాశ్యప్ కుమార్తె వివాహ వేడుకల్లో కనిపించారు. తొలిసారిగా వారిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వివాహానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. పెళ్లికి దారికి తీసిన పరిస్థితులతోపాటు పెట్టిన కండిషన్లను నాగచైతన్య వివరించారు. కండిషన్ల విషయంలో మాత్రం ఎటువంటి మొహమాటానికి పోలేదని స్పష్టం చేశాడు. దానికి ఒప్పుకోవడంవ్లలే శోభితను వివాహం చేసుకున్నట్లు తెలిపాడు.
ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలని
నాగచైతన్య మొదటి నుంచి తెలుగు వాతావరణానికి దూరంగా పెరిగాడు. చెన్నైలో పెరగడంవల్ల తమిళంతోపాటు ఇంగ్లిషు ఎక్కువగా మాట్లాడతాడు. దీంతో తెలుగులో మాట్లాడటానికి తడబడతాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగు కొంచెం అలవాటైనప్పటికీ ఇప్పటికీ పూర్తి స్పష్టంగా తెలుగు రావడంలేదనే ఆందోళనతో ఉన్నాడు. గతంలో వివాహం చేసుకున్న సమంత కూడా ఇంగ్లిషు, మళయాళం ఎక్కువగా మాట్లాడేది. తెలుగు మాట్లాడటం చాలా తక్కువగా ఉండేది ఇంట్లో. అలా కాకుండా తెలుగుదనం ఉట్టిపడాలంటే తాను చేసుకోబోయే శోభిత కూడా తెలుగమ్మాయే కాబట్టి కచ్చితంగా ఇంట్లో స్పష్టమైన తెలుగులోనే మాట్లాడనే షరతును శోభితకు విధించాడు.

తెలుగులో మాట్లాడమని అడిగేవాడిని
అందుకు శోభిత కూడా ఒప్పుకుంది. పెళ్లి జరగడానికి ముందు కూడా తనను కలిసిన పలు సందర్భాల్లో తెలుగులో మాట్లాడమని శోభితను కోరేవాడినని, తాను ఒప్పుకునేదని, అలాగే పెళ్లయిన తర్వాత కూడా ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటున్నట్లు నాగచైతన్య చెప్పాడు. మొత్తానికి నాగచైతన్య కోరుకున్నట్లుగానే ఒక తెలుగమ్మాయిని పెళ్లి చేసుకోవడంతోపాటు తెలుగులో బాగా మాట్లాడగలిగే అమ్మాయిని కూడా చేసుకున్నాడని.. అతని కోరిక నెరవేరిందని, కానీ పాపం సమంత ఏం చేస్తుందో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సమంతపై జాలిపడుతున్నారు. నాగచైతన్యతో కలకాలం సంతోషంగా సంసారం చేసుకుంటే అందరూ సంతోషించేవారని, నాగచైతన్యకు పిల్లలంటే చాలా ఇష్టమని, ఇద్దరు పిల్లల్ని కంటే విడిపోకుండా ఉండేవారేమోనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications