సమంతకు పబ్లిక్‌గా ప్రపోజ్ చేసిన నాగ చైతన్య ..కౌంటరిచ్చిన సామ్(వీడియో)
సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. సమంత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ తరువాత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య , సమంత కాంబినేషన్‌లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏమాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఏమాయ చేశావే సినిమాతోనే సమంత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చించిందనే విషయం తెలిసిందే.
సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కొన్నేళ్ళ బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. అటు నాగ చైతన్య మాత్రం శోభితను ప్రేమ వివాహం చేసుకున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు.

అనారోగ్య కారణంగా సమంత పెద్దగా సినిమాలు చేయడం లేదు. అటు నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తాజాగా సమంత, నాగ చైతన్యలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 'మనం' సినిమా ప్రమోషన్స్ సమయంలో నాగ చైతన్య, సమంత ఇద్దరూ కలిసి ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. సదరు యాంకర్ సమంతకు ప్రపోజ్ చేయాలని నాగ చైతన్యను కోరడం జరిగింది.
దీంతో సమంతకు అందరూ చూస్తుండగానే ఐ లవ్ యు సామ్ అని చెప్పాడు నాగ చైతన్య. అయితే దీనిపై సమంత రియాక్ట్ అవుతూ.. 'ఏదో చెప్పాలన్నట్టు కాకుండా, మనస్ఫూర్తిగా చెప్పు' అంటూ నాగ చైతన్యకు కౌంటరిచ్చింది. దీంతో మరోసారి సమంతకు ప్రపోజ్ చేస్తాడు.ఆ క్షణంలో సమంత సిగ్గుపడటం, వారి మధ్య కెమిస్ట్రీ స్పష్టంగా కనిపించింది. అయితే అప్పటికే వారిద్దరు గాఢమైన ప్రేమలో ఉన్నారనే విషయం ఎవరికి తెలియదు. ఆ తర్వాత వీరిద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం, విడిపోవడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి.












Click it and Unblock the Notifications