ఆమె అంటే చాలా భయం అంటున్న నాగ చైతన్య.. సమంతానా ? శోభితనా ??
అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. సినిమాల పరంగా చూస్తే గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతూ ఈసారి 'తండేల్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నాగార్జున కూడా ఇటీవలే "కుభేర" సినిమాతో సత్తా చాటారు. ఇక పర్సనల్ విషయాల్లోకి వెళ్తే.. నాగ చైతన్య, అఖిల్ ల వివాహాలు జరిగాయి. దీంతో అక్కినేని ఫ్యామిలీ ప్రజెంట్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్నారు.
అయితే రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె అంటే చాలా భయం అంటూ నాగ చైతన్య వేపం అయ్యారు. ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో ఆమె ఎవరా అని జోరుగా చర్చ నడుస్తోంది. కొందరు ఏమో ఆమె తన మాజీ భార్య సమంత అని కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం శోభిత ధూళిపాళ్ల అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఏంటి స్టోరీ..?
రీసెంట్ గానే రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోలో చైతన్య గెస్ట్‌గా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో చైతూ - రానా మధ్య జరిగిన సరదా సంభాషణ జరిగింది. చైతన్య మాట్లాడుతూ - "నా భార్యకంటే సాయి పల్లవికే ఎక్కువగా భయపడతాను. ఆమెతో డాన్స్ చేయాలంటేనూ, నటించాలన్నా భయమే" అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా నువ్వు కూడా విరాట పర్వం చేశావు కదా తనతో.. కానీ డాన్స్ చేయకుండా తప్పించుకున్నావు అని రానాని ఆటపట్టించాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి సాయి పల్లవికి కాల్ చేసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
నాగచైతన్య 2017లో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వివాహమైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక గత ఏడాది నవంబర్లో ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్నారు. అలానే తన షో టూ రెస్టారెంట్ బిజినెస్ కూడా చూసుకుంటున్నారు.
చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'తండేల్' సినిమా ద్వారా కెరీర్‌లో ఓ మైలురాయిని అందుకున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మత్స్యకారుడిగా చైతూ చేసిన నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇది కేవలం హిట్ సినిమానే కాకుండా, రూ.100 కోట్ల క్లబ్‌లో కూడా చేరి అక్కినేని అభిమానుల్లో ఊపు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం చైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో NC-24 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీ చేస్తున్నారు. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో గోల్డెన్ లెగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications