నాగ చైతన్య - శోభితల పెళ్లి వేడుకలు ప్రారంభం..హల్దీ పిక్స్ వైరల్..
అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు మొదలయ్యాయి. వీరి వివాహం డిసెంబర్ 4వ తేదిన ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇక, ఇప్పుడు అక్కినేని కుటుంబంతా ఈ పెళ్లిపనుల్లో మునిగిపోయారు. ఇప్పటికే హల్దీ హంగామా షూరు అయ్యింది. ఈ క్రమంలో ఎంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో నాగ చైతన్య - శోభితలకు హల్దీ వేడుక జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.
నాగచైతన్య-శోభితల పెళ్లి డిసెంబర్ 4వ తేదిన రాత్రి 8:13 గంటలకు జరగనుంది. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్ కూడా వేశారు. టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి ఫ్యామిలీలతో పాటు దిగ్గజ దర్శకులు, అగ్రతారలు కూడా విచ్చేయనున్నారు. ఇక, హల్దీ వేడుకల్లో చైతూ-శోభిత ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఈ పెళ్లిని ఎంతో సంప్రదాయబద్దంగా నిర్వహించనున్నారు. వివాహనికి అతిథులు మాత్రం చాలా తక్కువే రాబోతున్నట్లు సమాచారం.

ఈ స్టార్స్ సందడి చేయనున్నారు..
ఇటీవలే అక్కినేని అఖిల్ నిశ్చితార్థ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అఖిల్ జైనబ్ రవ్జీల వివాహం జరగనున్నట్లు తాజాగా నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా నాగచైతన్య, శోభితల పెళ్లి తంతు ముగియగానే అఖిల్ పెళ్లి పనులు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు కుటుంబాల వారు ఈ పెళ్లిపనుల్లో బిజి బిజిగా ఉన్నారు. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. నాగచైతన్య, శోభితల పెళ్లికి మెగా కుటుంబంతోపాటు, దగ్గుబాటి వారు కూడా సందడి చేయనున్నారు. వీరితోపాటు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు, ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య - శోభితల పెళ్లికి సంబంధించి వీరికి ఆహ్వానం అందినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications