కాబోయే భార్యతో రొమాంటిక్‌గా నాగ చైతన్య
సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్‌లో ఉన్నాడనే ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయింది.
సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. ఈ విషయంలో అభిమానులకు షాకిస్తూ శోభిత ధూళిపాళలను సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరు నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం తర్వాత నాగ చైతన్య , శోభిత ధూళిపాళ కలిసి కనిపించింది లేదు. ఇద్దరూ కూడా తమ తమ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల కలిసింది లేదు.

తాజాగా తమ సినిమా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి ఇద్దరూ వెకేషన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. శోభిత ధూళిపాళ కలిసి లిఫ్ట్‌లో ఉన్న ఫొటోను నాగ చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో స్టైయిల్‌గా ఫొటోలకు షోజులిచ్చారు. అంతేకాకుండా 'ప్రతిచోటా అన్నీ ఒకేసారి' అనే క్యాప్షన్ కూడా ఈ ఫొటోకు జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటొ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్' మూవీలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు విరుపాక్ష సినిమా డైరెక్టర్‌తో మరో మూవీ చేయడానికి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ సినిమాలో పూజా హెగ్దెను తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక నిశ్చితార్థం తర్వాత శోభిత పెద్దగా బయట కనిపించలేదు. ఇటీవల శోభిత 'మంకీ మ్యాన్'తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా 'లవ్ సితార' జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. వచ్చే మే నెలలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం జరగనుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications