సమంతను చూడగానే చిరాకు పడ్డ నాగ చైతన్య
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.
విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో హిట్ సినిమాలు రీరిలీజ్‌లు నడుసోన్న సంగతి అందరికి తెలిసిందే. దీనిలో భాగంగానే నాగ చైతన్య, సమంత కాంబినేషన్‌లో వచ్చిన మనం సినిమాను అభిమానులు రీరిలీజ్ చేశారు. ఈ స్పెషల్ షోకు హీరో నాగ చైతన్యతో పాటు, దర్శకుడు విక్రమ్ కుమార్ హాజరైయ్యారు. హైదరాబాద్‌లోని దేవి థియేటర్‌లో అభిమానులతో కలిసి నాగ చైతన్య సినిమాను చూశారు.

ఫ్యాన్స్ మనం చిత్రాన్ని సూపర్‌గా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత మధ్య సన్నివేశాలు వచ్చినప్పుడు స్క్రీన్ దగ్గరకి వెళ్లి మరీ హంగామా చేయడం కనిపించింది. సమంతతో నాగ చైతన్య పెళ్లి సన్నివేశం రాగానే ఫ్యాన్స్ సీట్లలోనుంచి లేచి గంతులేస్తూ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య ముందే ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. పెళ్లి సీన్ కి ఫ్యాన్స్ హంగామా చేస్తుండడంతో చైతు వారిని కూర్చోమని చెబుతూ చిరాకు పడ్డ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications