పిల్లల్ని కనడంపై సమంత కామెంట్స్..నాగ చైతన్య కౌంటర్

హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌ మెయిన్‌టైన్ చేశాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. ఈక్రమంలోనే సైలెంట్‌గా శోభితతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుంది. మరోవైపు సమంత మాత్రం సింగిల్‌గానే ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడుతో సమంత ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవి కేవలం ప్రచారానికే పరిమితం అయ్యాయి.

Naga Chaitanya s comments on having children go viral

ఇదే సమయంలో సమంత పిల్లల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. హనీబన్నీ సిరీస్‌కు సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత పిల్లల గురించి కీలక కామెంట్స్ చేశారు. తాను పోషించిన తల్లి పాత్ర గురించి మాట్లాడింది. తనకు కూడా తల్లిని కావాలనే కోరిక ఉందని, కలలు ఉన్నాయని, అమ్మగా ఉండటానికి బాగా ఇష్టపడతానని సమంత చెప్పారు. అయితే ఇందుకు బాగా ఆలస్యమైందని మాత్రం తాను అనుకోవడంలేదని, జీవితంలో ప్రస్తుతం తాను చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నానని చెప్పింది. నిజ జీవితంలో తల్లిని కావాలనే కోరిక ఉందని సమంత చెప్పడం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్నిబట్టి సమంత రెండోపెళ్లి చేసుకోబోతున్నట్లుగా ముందే చెప్పిందని, అందుకు హింట్ ఇచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా నాగచైతన్య సైతం పిల్లలపై స్పందించాడు. హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే బాగుంటుందని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.అయితే వెంకీ మామలా నలుగురు పిల్లలు మాత్రం వద్దని సరదాగా స్పందించాడు.అయితే సమంత రెండు రోజుల క్రితం పిల్లల గురించి కామెంట్స్ చేసిన వెంటనే నాగ చైతన్య కూడా పిల్లలు గురించి మాట్లాడటంతో ఆమెకు కౌంటరిచ్చాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వీరిద్దరు పిల్లల గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+