నాగ చైతన్య చాలా రొమాంటిక్..రెండు గంటల పాటు అదే పని.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత.పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.వీరిద్దరు తమ సినిమా షూటింగ్‌లకు కొంత గ్యాప్ ఇచ్చిన హానీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు. వీరిద్దరు తమ హానీమూన్ పీరియడ్‌ను సైతం పూర్తి చేసుకున్నారు. ఇటీవలే 'వోగ్' మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఒకరి గురించి మరొకరు ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
2022 ఏప్రిల్‌లో నాగ చైతన్యతో స్నేహం మొదలైందని శోభిత చెప్పుకొచ్చింది. ఆమె నాగ చైతన్య మొదటిసారి ముంబైలోని ఓ కేఫ్‌లో కలిసినట్టు తెలిపింది. అప్పట్లో శోభిత ముంబైలో ఉన్నట్టు నాగ చైతన్య హైదరాబాద్‌లో ఉన్నట్టు చెప్పగా ఆమె తాను వేసుకున్న డ్రెస్ కలర్, చైతు వేసుకున్న డ్రస్ కలర్ కూడా చెప్పింది.వీరిద్దరు కర్ణాటకలోని ఓ పార్క్ కు వెళ్లినట్టు అక్కడ ఏకాంతంగా కొంత సమయం గడిపినట్టు శోభిత చెప్పింది. ఇద్దరు ఒకరికొకరు గోరింటాకు కూడా పెట్టుకున్నామని కూడా ఈ భామ చెప్పుకొచ్చింది.
శోభిత, నాగ చైతన్య ఈ ఏడాది గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు వెళ్లగా అక్కడ శోభిత కుటుంబాన్ని చైతూ కలిశారని.. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే గోవాలో పెళ్లి గురించి మాట్లాడుకున్నట్టు శోభిత తెలిపింది. అలా నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి గురించిన విషయాలను శోభిత వెల్లడించింది.కస్టడీ ఫ్లాప్ అయినప్పుడు, తండేల్ హిట్టయినప్పుడు ఒకేలా ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఈ విషయమే అతనిలో నాకు బాగా నచ్చుతుందని శోభిత వెల్లడిచింది. చైతన్య చాలా రొమాంటిక్ అని చెప్పిన శోభిత..తను ఇష్టపడే బైక్‌ను రెండు గంటల సమయం కేటాయించి తనే శుభ్రం చేసుకుంటాడు. తనకు నచ్చిన వస్తువుల కోసం, వ్యక్తుల కోసం ఏదైనా చేస్తాడని చెప్పుకొచ్చింది. ఇలా అతి తక్కువ కాలంలోనే నాగ చైతన్యను అర్థం చేసుకున్నానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications