అల్లు అర్జున్‌పై నాగబాబు షాకింగ్ కామెంట్స్
గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అనేక కథనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం అల్లు అర్జున్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి మెగా ,అల్లు కుటుంబాల మధ్య మాటల్లేవనే చర్చ సాగుతోంది. మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.
మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది.అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదలకు మెగా ఫ్యామిలీ అడ్డుగా నిలుస్తోందని అల్లు అభిమానులు ఆరోపిస్తున్నారు.మెగా ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. జులై 20న మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు.

లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మి ప్రణతి పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ గురించి మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌పై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఒక అభిమాని అల్లు అర్జున్ సంగతి ఏంటి బాబాయ్ అని ప్రశ్నించగా, పుష్ప 2 కోసం వెయిటింగ్ చేస్తోన్నా అంటూ నాగబాబు కామెంట్ చేశారు. మరొక సందర్భంలో అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు అని అడిగితే అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్ అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కొంతమంది అభిమానులు మెగా వర్సెస్ అల్లు అనే చర్చ మీడియాలో సోషల్ మీడియాలోనే తప్ప రియాలిటీలో లేదని నాగబాబు నిరూపించారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది పుష్పా 2 కోసం వెయిటింగ్ అన్నారంటే, దాని వెనుక వేరే అర్థం ఏమైనా ఉందేమో అనే కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications