కాబోయే అల్లుడిపై నాగబాబాబు కీలక ప్రకటన
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా ఆమె విడాకులపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. నటిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందకపోయినా, ఆమె వ్యక్తిగత జీవితంపై మాత్రం అభిమానులకు ఆసక్తి ఎక్కువే. పెళ్లి, విడాకుల విషయంలో నిహారికపై వచ్చిన ట్రోలింగ్‌ల గురించి ఆమె పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా, ఈ విషయంపై ఆమె తండ్రి నాగబాబు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.
నిహారిక పెళ్లి విషయంలో తాము పొరపాటు చేశామని నాగబాబు అంగీకరించారు. "మేము వారిని సరిగా అంచనా వేయలేకపోయాము. వారికి సింక్ అవ్వలేదు. మ్యూచువల్‌గా ఇద్దరూ విడిపోయారు" అని ఆయన తెలిపారు. నిహారిక పెళ్లి విషయంలో అబ్బాయిని చూపించింది తామే అయినా, అది ఆమె సొంత ఇష్టం కాదని, తమ మద్దతుతో చేయలేదని స్పష్టం చేశారు.

ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారు... వారు జీవితాంతం కలిసి ఉండాలా వద్దా అనేది వాళ్ల జడ్జిమెంట్. వాళ్లు వద్దనుకున్నారు... విడిపోయారని నాగబాబు పేర్కొన్నారు. వారిద్దరి బంధంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, విడిపోవాలనే నిహారిక నిర్ణయాన్ని తాను అంగీకరించానని చెప్పారు. నిహారిక అడిగింది. ఆమె విడిపోతాను అంది. ఓకే అని చెప్పాను. మర్యాదపూర్వకంగానే విడిపోయారని నాగబాబు వివరించారు.
పిల్లల విషయాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, భవిష్యత్తులో కూడా చేసుకోనని నాగబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిహారిక తన ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, భవిష్యత్తులో ఆమె మరొకరిని కలుసుకుని పెళ్లి చేసుకుంటుందని, తన రెండో పెళ్లి విషయంలో తన జోక్యం ఉండబోదని, నిహారిక ఎవర్ని ఇష్టపడినా నాకు ఇష్టమే అని నాగబాబు చెప్పుకొచ్చారు.
-
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?












Click it and Unblock the Notifications