నిహారికకు ఇష్టలేని పెళ్లి చేశా.. తప్పు నాదే - నాగబాబు
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. వివాహం అనంతరం పలు వివాదాల్లో చిక్కుకుంది నిహారిక. దీంతో తమ వైవాహిక బంధానికి అతి తక్కువ కాలంలోనే గుడ్ బై చెప్పింది.
భర్తకు విడాకులిచ్చి మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తోన్న ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడు స్పందించలేదు. తన జీవితంలో విడాకులు అనుకోకుండా జరిగిపోయిందంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా నిహారిక పెళ్లి, విడాకులపై తండ్రి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

నిహారిక పెళ్లి విషయంలో మేము పొరపాటు చేశాం. మేము వారిని సరిగా అంచనా వేయలేకపోయాము. వారికి సింక్ అవ్వలేదు. మ్యూచువల్‌గా ఇద్దరూ విడిపోయారని నాగబాబు తెలిపారు. నిహారిక పెళ్లి విషయంలో అబ్బాయిని చూపించింది మేమే తప్ప.. ఆమె మద్దతుతో మేము చేయలేదు. మేము చెప్పాము.. ఓకే అన్నట్లు అంతే. ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది కానీ, అది తన సొంత ఇష్టం కాదని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారు.. వారు జీవితాంతం కలిసి ఉండాలా వద్దా అనేది వాళ్ల జడ్జిమెంట్. వాళ్లు వద్దనుకున్నారు.. విడిపోయారని నాగబాబు తెలిపారు. వారిద్దరి బంధంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, విడిపోవాలనే నిహారిక నిర్ణయాన్ని తాను అంగీకరించానని చెప్పారు. నిహారిక అడిగింది. ఆమె విడిపోతాను అంది. ఓకే అని చెప్పాను. మర్యాదపూర్వకంగానే విడిపోయారని నాగబాబు తెలిపారు.
పిల్లల విషయాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, భవిష్యత్తులో కూడా చేసుకోనని నాగబాబు స్పష్టం చేశారు. నిహారిక ప్రస్తుతం తన ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, భవిష్యత్తులో ఆమె మరొకరిని కలుసుకుని పెళ్లి చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
-
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?












Click it and Unblock the Notifications