పబ్లిక్‌గా కూతురు పరువు తీసిన నాగబాబు
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. వివాహం అనంతరం పలు వివాదాల్లో చిక్కుకుంది నిహారిక. దీంతో తర వైవాహిక బంధానికి అతి తక్కువ కాలంలోనే గుడ్ బై చెప్పింది.
భర్తకు విడాకులిచ్చి మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తోన్న ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడు స్పందించలేదు.తన జీవితంలో విడాకులు అనుకోకుండా జరిగిపోయిందంటూ ఆమె కామెంట్స్ చేశారు. విడాకుల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నిహారిక, తిరిగి ఇండస్ట్రీలో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కించారు.

నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. మెగా హీరోలు ఈ ఈవెంట్‌కు వచ్చి నిహారికకు మద్దతుగా నిలిచారు. నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు సైతం ప్రీ రిలీజ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిహారిక చిన్నతనంలో చేసిన అల్లరి గురించి ఆయన పబ్లిక్‌గా మాట్లాడారు.
నిహారిక గురించి నాగబాబు మాట్లాడుతూ.. ''నిహారిక నా స్వీటెస్ట్ డాటర్. తను కొంచెం పెద్దయ్యాక తన రూంలో పడుకోమని చెప్పేవాడిని. కానీ తన మదర్ కిచెన్‌లోకి వెళ్లగానే మళ్లీ వచ్చి నా బెడ్ మీదకు వచ్చి నా షర్ట్‌లో దూరి బాగా అల్లరి చేసేది'' అని నాగబాబు చెప్పుకొచ్చారు. పబ్లిక్‌గా అంతమందిలో నిహారిక చిలిపి చేష్టలు గురించి నాగబాబు బయటపెట్టాడు. తన తండ్రి ఈ విషయాలు చెబుతుండగా నిహారిక తన ఫేస్‌కు చేయి అడ్డుపెట్టుకుని కాస్త షేమ్‌గా ఫీల్ అయ్యారు.












Click it and Unblock the Notifications