నాగచైతన్య - నాని కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన 15 సంవత్సరాల తర్వాత తొలిసారి రూ.100 కోట్ల మార్క్ ఉన్న చిత్రాన్ని అందుకున్నారు. సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి పోటీపడి నటించారు. నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కి ఘనవిజయాన్ని నమోదు చేసింది.దీంతోపాు శాటిలైట్ హక్కులు, ఓటీటీ హక్కుల ద్వారా నిర్మాత అల్లు అరవింద్ భారీ లాభాలను ఆర్జించారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చేయబోతున్నారు.
అనుకోకుండా మిస్ అయింది
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా విడుదలైన హిట్ 3 ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. స్టార్ హీరోల తర్వాత స్థానాల్లో నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రామ్ పోతినేని కొనసాగుతున్నారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరితో మల్టీస్టారర్ చేసినా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. అలాగే నాగచైతన్య-నాని కాంబినేషన్ లో రావాల్సిన ఓ సినిమా మిస్ అయింది. నాగచైతన్య - సునీల్ కాంబినేషన్ లో తడాఖా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. చైతన్య కెరీర్ లో ఈ సినిమా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.

చేయడం కష్టమే అంటున్నారు
వాస్తవానికి ఈ సినిమాలో ముందుగా సునీల్ కు బదులు నానిని అనుకున్నారు. అప్పుడు నానికి ఇప్పుడున్నంత క్రేజ్ లేదు. డేట్లు ఖాళీలేకపోవడంతో సినిమా కథ నచ్చినప్పటికీ చేయడానికి వీలుపడలేదు. దీంతో నానికి బదులుగా దర్శకుడు డాలీ సునీల్ ను తీసుకున్నారు. ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. అలా నాగచైతన్య- నాని కాంబినేషన లో సినిమా మిస్ అయింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా చేయడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఓవర్సీస్ లో నాని మార్కెట్ మహేష్ బాబు, తారక్, అల్లు అర్జున్, ప్రభాస్ రేంజ్ లో ఉంది. ఇటువంటి తరుణంలో మల్టీస్టారర్ చేయడానికి నాని ఒప్పుకుంటాడా? అనేది సందేహమే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.












Click it and Unblock the Notifications