Viral video: నాగచైతన్య ఇలా పడిపోయాడేంటి..? తప్పిన ప్రమాదం..
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'వృషకర్మ' అనే మూవీ చేస్తున్నాడు. అంతకుముందు తండేల్ తో భారీ విజయం అందుకున్న చైతూ.. ప్రస్తుతం మైథలాజికల్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. గ్లింప్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఈ మూవీని విరూపాక్ష మూవీ ఫేమ్ కార్తిక్ దండు తెరకెక్కించాడు. అయితే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కినేని నాగచైతన్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్టేజీపై నాగ చైతన్య కూర్చున్న కుర్చీ ఒక్కసారిగా కింద పడిపోయింది. దాంతో నాగ చైతన్య కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన నాగ చైతన్య సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని పైకి లేపింది. అలా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఆయన్ని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో నాగ చైతన్య ఎదురుగా ఉన్న ఫ్యాన్స్, మీడియా సిబ్బంది ఒక్కసారిగా ఆందోళన చెందారు.

అయితే అభిమానులు కంగారుపడటం గమనించిన చైతూ.. ఏమీ కాలేదని నవ్వుతూ వారికి సైగ చేశాడు. ఆ తర్వాత ఏమాత్రం తడబడకుండా తన ప్రసంగాన్ని కొనసాగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు టేక్ కేర్ చైతూ అని కామెంట్స్ చేస్తున్నారు.
కిందపడ్డ హీరో నాగచైతన్య
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2026
ప్రసాద్ ఐమాక్స్ లో #VrushakarmaGlimpse లాంచ్ ఈవెంట్ లో ఘటన
చైతన్యకు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసిన మేనేజ్మెంట్ సంస్థ
Hero Naga Chaitanya falls down. Incident at the #VrushakarmaGlimpse launch event in Prasad IMAX.
Management clarifies that… pic.twitter.com/8ze78byeLV
ఇక నాగచైతన్య, కార్తిక్ దండు కాంబోలో వస్తున్న 'వృషకర్మ' సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. సుకుమార్ రైటింగ్స్, SVCC బ్యానర్ లు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.












Click it and Unblock the Notifications