నాగచైతన్య-శోభిత వివాహంపై పునరాలోచనలో నాగార్జున?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చి శోభిత ధూళిపాళను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు ఎనిమిదో తేదీన వీరి నిశ్చితార్థం నాగార్జున ఇంట్లో జరిగింది. వివాహాన్ని అంగరంగ వైభవంగా డిసెంబరు నాలుగోతేదీన అన్నపూర్ణ స్టూడియోకు చెందిన 22 ఎకరాల స్థలంలో చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయికానీ దీనిపై అధికారికంగా ధ్రువీకరణ రాలేదు. నాగచైతన్య-శోభిత వివాహం గురించి చెప్పగానే ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి వీరిద్దరూ 2027లో విడిపోతారని చెప్పారు. దీనిపై మహిళా కమిషన్ నోటీసులు జారీచేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించడం, స్టే ఇచ్చి తొలగించడం, వేణుస్వామిపై చర్యలు తీసుకోవడానికి మహిళా కమిషన్ రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది.

మరో జ్యోతిష్యుణ్ని సందర్శించిన నాగార్జున
ఇటువంటి తరుణంలోనే అక్కినేని నాగార్జున నాగచైతన్య-శోభిత వివాహం గురించి ఆలోచనలో పడ్డారంటూ సోషల్ మీడియాలో వార్త వైరలవుతోంది. దీని ప్రకారం ఆ పోస్టులో నాగార్జున, నాగచైతన్య, శోభిత పేర్లు ప్రస్తావించకుండా తెలుగులో ప్రముఖ స్టార్ హీరో అని, అతని కొడుకు అని, బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించే నటి అని పేర్కొన్నారు. దానిప్రకారం వేణుస్వామి జ్యోతిష్యం చెప్పిన తర్వాత నాగార్జున మరో జ్యోతిష్యుడిని సందర్శించారు. వారు కూడా వేణుస్వామి చెప్పిన తరహాలోనే వీరిద్దరు కూడా విడిపోయే అవకాశం ఉందని చెప్పినట్లు వార్త సర్క్యులేట్ అవుతోంది. వీరిద్దరి వివాహంపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

Nagarjuna reconsiders Naga Chaitanya-Sobhita marriage

పేర్లు చెప్పకపోయినా వారిగురించే
సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన తర్వాత ఇదంతా నాగచైతన్య-శోభిత గురించే అని, వారు పేర్లు పేర్కొనకపోయినప్పటికీ వారిద్దరి గురించే అని, ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ నెటిజన్లు, అక్కినేని అభిమానులు కొట్టేస్తున్నారు. 2022 నుంచి ప్రేమలో ఉన్న నాగచైతన్య-శోభిత పెద్దలను ఒప్పించి ఒకింటివారు కాబోతున్నారు. అయితే వీరిద్దరూ విడిపోతారంటూ వస్తున్న వార్తలు మాత్రం అక్కినేని అభిమానులను కలవరపెడుతున్నాయి. శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే విడిపోతారంటూ వార్తలు రావడం ఏమిటని, వేణుస్వామిలాంటివారు అలా పబ్లిక్ గా జ్యోతిష్యం చెప్పడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+