'నాతో పడుకుంటే ఆఫర్ ఇస్తా': తెలుగు దర్శకుడిపై నాగార్జున హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
సినీ ఇండస్ట్రీలో వేధింపులు సహజం. అటు హాలీవుడ్ అయినా ఇటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏ పరిశ్రమ అయినా క్యాస్టింగ్ కౌచ్ సాధారణంగా మారిపోయింది. పదేళ్ల క్రితం వరకూ ఇలాంటివి గుట్టు చప్పుడు కాకుండా ఉండేవి. బయటకు వచ్చేవి కావు. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువత ఎవరి చెప్పాలో తెలియక లోలోపల నలిగిపోయేవాళ్లు. కానీ రానురాను సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఎక్కడినుంచైనా నిర్భయంగా తమ బాధలను చెప్పుకునే అవకాశం దొరికింది. ఈ క్రమంలో ఇలాంటి సంఘటనలు ఈ మధ్య అధికంగా తెరపైకి వస్తున్నాయి.
అయితే తాజాగా టాలీవుడ్ లో మరో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని నాగార్జున హీరోయిన్ సయామీ ఖేర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కింగ్ నాగార్జునతో ఈ భామ 'వైల్డ్ డాగ్' అనే మూవీ చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది సయామీ ఖేర్. ఓ తెలుగు డైరెక్టర్ తనని కమిట్‌మెంట్ అడిగాడని తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తెలుగు దర్శకుడొకతను కమిట్‌మెంట్ అడిగాడని స్పష్టం చేసింది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.
🚨 🚨 #BreakingNews Saiyami Kher says she was asked to get lip fillers, nose job: ‘Everyone ends up looking like a factory-made product’ https://t.co/UaZ5VQGl1I
— Instant News ™ (@InstaBharat) May 21, 2025
Saiyami Kher revealed that she would never want to undergo any cosmetic surgery, stating she has no problems with h…
ఓ తెలుగు సినిమాలో పాత్ర కోసం ఆ డైరెక్టర్ ఏజెంట్ తనకు ఫోన్ చేసి.. అవకాశం కోసం కాంప్రమైజ్ అవ్వాలని చెప్పిందని నటి సయామీ ఖేర్ చెప్పుకొచ్చింది. మహిళ అయి ఉండి సాటి మహిళను ఇలా అడగటం తనను షాక్ కు గురిచేసిందని చెప్పింది. వెంటనే తనకు ఇలాంటివి అవసరం లేదని చెప్పినట్లు గుర్తుచేసుకుంది సయామీ ఖేర్. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక నటి సయామీ ఖేర్.. సాయి ధరమ్ తేజ్ 'రేయ్' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కింగ్ నాగార్జునతో ఈ భామ 'వైల్డ్ డాగ్' అనే మూవీ చేసింది. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ 'హైవే' చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. ఇటీవల ఆమె సన్నీ డియోల్ నటించిన 'జాట్' మూవీలో కీలక పాత్రలో మెరిచింది. ప్రస్తుతం ఆమె పలు భాషల్లో వెబ్ సిరీస్‌లు చేస్తోంది.












Click it and Unblock the Notifications