అన్నా మన సినిమాకు టీ ఖర్చులు కూడా రావట్లేదే..!!
సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ప్లాఫ్ అవుతుందో చెప్పడం కష్టం. పెద్ద పెద్ద దర్శకులు కూడా ఆడియన్స్ టేస్ట్ ను పట్టుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమాలు ఒక్కోసారి ప్లాఫ్ అవుతుంటాయి. కానీ ఇంకొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండానే సూపర్ హిట్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. మంచి కంటెంట్ తో వస్తే హిట్ చేసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉంటున్నారు.
ఇక టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు ప్రస్తుతం వరుస ప్లాఫ్ లు ఎదురవుతున్నాయి. కెరీర్ బిగినింగ్ లో హిట్ ఛలో, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మాఇంటికి, జాదూగాడు, కళ్యాణ వైభోగమే, జ్యో అచ్చుతానంద లాంటి క్లీన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య ఇటీవలి కాలంలో మాత్రం హిట్ సినిమాను ఇవ్వడంలో విఫలమవుతున్నాడు. ఇప్పుడు ఆయన సినిమా ఒకటి వస్తుందని జనాలకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఇక ఇటీవల నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీని రామ్ దేశినా తెరకెక్కించారు. ఈ మూవీలో శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. నాగశౌర్యకు జోడీగా విధి యాదవ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ మూవీలో ఇతర నటీనటులు సముద్రఖని, మైమ్ గోపి, నరేష్, వెన్నెల కిశోర్, పూర్ణ తమ పాత్రల్లో నటించారు. బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాను శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. అయితే ఈ మూవీ ప్రేక్షకుల్ని మరో ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. డిజాస్టర్ టాక్ తో సరిపెట్టుకుంది.

నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాను రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు మాత్రం రూ. 50 లక్షలు కూడా రాలేదని ట్రేడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు బిజినెస్ లేకపోవడమే కాదు.. ఇప్పటివరకూ ఓటీటీ రైట్స్ కూడా రాలేదు. శాటిలైట్ కూడా కాలేదు. దాంతో ఈ మూవీని సొంతంగా నిర్మాత రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సరైన కథలను ఎంచుకోవడంలో నాగశౌర్య విఫలమైనట్లు కనిపిస్తోంది. బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ కూడా రొటీన్ స్టోరీనే.. అందుకే ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయింది. ఫ్యూచర్ లో నాగశౌర్య మంచి సినిమాలతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం..












Click it and Unblock the Notifications