ఒక నైట్‌కి నా రేటు ఎంతో కూడా వాళ్లే ఫిక్స్ చేశారు..

నైనికా అనసూరు.. తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై రియాలిటీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లతో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా "ఢీ" డ్యాన్స్ షోతో కెరీర్ ప్రారంభించిన ఈమె.. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో "పొట్టి పిల్ల"గా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సీరియల్స్‌లోనూ నటిగా మెప్పించి.. ఆ క్రేజ్‌తోనే Bigg Boss Telugu Season 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కాగా ఇటీవల Varsha హోస్ట్ చేస్తున్న 'కిస్సిక్ టాక్స్' అనే టాక్ షోలో పాల్గొన్న నైనిక.. తన జీవితంలోని పలు వ్యక్తిగత అనుభవాలపై ఓపెన్ అయ్యింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా మారాయి. కొంతమంది అమ్మాయిల వల్లే కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయనే అభిప్రాయం పెరిగింది" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు తనలాంటి కొత్తవారికి చాలా కష్టంగా మారుతున్నాయని తెలిపింది. ఇప్పుడు ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

nainika-who-got-fame-from-dhee-show-and-bigg-boss-comment-about-casting-couch-and-love-failure

కమిట్మెంట్..

ఇండస్ట్రీలో అవకాశాల కోసం కొందరు అనుచిత డిమాండ్లు చేస్తున్నారని, నేరుగా 'కమిట్మెంట్' గురించి అడుగుతున్నారని ఆమె వెల్లడించింది. ఒకసారి బ్రాండ్ ప్రమోషన్ పేరుతో తనను సంప్రదించిన వ్యక్తి 'పర్సనల్ రిక్వైర్మెంట్' అంటూ అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా వైరల్ చేస్తున్నారని ఒకసారి తెలిసి షాక్‌కు గురయ్యానని నైనిక తెలిపింది. తన ప్రమేయం లేకుండా ఫొటోలకు రేట్లు పెట్టడం వంటి విషయాలు విన్నప్పుడు చాలా బాధపడ్డానని చెప్పింది.

మరోవైపు తన జీవితంలో ఒకరిని ఎంతో ప్రేమించానని, కానీ ఆ వ్యక్తి మోసం చేయడంతో తీవ్రంగా మానసికంగా కుంగిపోయానని తెలిపింది. కెరీర్‌ను కూడా పక్కన పెట్టి ఆ సంబంధాన్ని కాపాడేందుకు ప్రయత్నించానని, కానీ చివరికి నిరాశే మిగిలిందని భావోద్వేగంగా చెప్పింది. జీవితంలో ఎదురైన ఒత్తిళ్ల కారణంగా ఒక దశలో తీవ్ర నిరాశకు గురై ప్రమాదకర నిర్ణయం తీసుకునే స్థితికి వెళ్లినట్లు కూడా ఆమె తెలిపింది. అయితే ప్రస్తుతం తాను ఆ పరిస్థితులను దాటుకుని, మానసికంగా బలంగా మారానని స్పష్టం చేసింది. తన అనుభవాలు ఇతరులకు హెచ్చరికగా నిలవాలని ఆమె కోరుకుంది. ప్రస్తుతం నైనిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+