నానా పటేకర్‌ చివరి సినిమా రిలీజ్ వాయిదా.. ఎందుకంటే?

బాలీవుడ్ యువ కథానాయిక అనీత్ పడ్డా ప్రముఖ పాత్రలో ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వంలో మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్న హారర్-కామెడీ చిత్రం 'శక్తి శాలిని' ఈ సినిమాను నిజానికి 2026 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే షారుఖ్ ఖాన్ నటించిన 'కింగ్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొనడంతో అనీత్ పడ్డాకు సోలో విడుదలను అందించాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఈ సినిమా విడుదలను 2027 ప్రారంభానికి వాయిదా వేశారు.

2027 జనవరిలో 'లవ్ అండ్ వార్', 'గోల్మాల్ 5', ఫిబ్రవరిలో 'నాగ్జిల్లా', 'ముఫాసా' వంటి పెద్ద సినిమాలు విడుదల కానుండటంతో 'శక్తి శాలిని' సినిమాను 2027 మార్చి నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు అనుకూలమైన సమయంగా పరిశీలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 'స్త్రీ', 'ముంజ్య' చిత్రాల తరహాలోనే మ్యాడాక్ హారర్-కామెడీ యూనివర్స్‌లో ఇది మరొక కీలక చిత్రంగా నిలవనుంది.

Nana Patekar Last Movie Shakti Shalini Postponed to 2027 to avoid clash with Shah Rukh Khan

నానా పటేకర్ మరణంపై కేసు నమోదు
మరో విచారకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుల్లో ఒకరైన నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో 2026 అక్టోబర్ 8న గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన ఈ సినిమా షూటింగ్‌ను 2026 మే నెలలోనే పూర్తి చేశారు. ఆయన మరణంపై గోవా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో భాగంగా నానా పటేకర్ మరణానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పోస్టుమార్టం నివేదికను పరిశీలించడంతో పాటు కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి వాంగ్మూలాలను సేకరించనున్నారు. ఒకవేళ ఈ విచారణలో ఆయనది సహజ మరణమేనని తేలితే కేసును ముగించే అవకాశం ఉంది. అలా కాకుండా ఏమైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నట్లు తేలితే మాత్రం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు.

విచారం వ్యక్తం చేసిన దర్శకుడు
దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ నానా పటేకర్ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేశారు. నానా పటేకర్ మరణానికి 10 రోజుల ముందు కూడా సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనుల గురించి మాట్లాడారని, సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారని తెలిపారు. 'శక్తి శాలిని' నానా పటేకర్ నటించిన చివరి సినిమా అవుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని, ఈ సినిమా భారతీయ సినిమాలో అత్యుత్తమ నటులలో ఒకరైన ఆయనకు ఇచ్చే గొప్ప నివాళిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

నటీనటుల వివరాలు
ఈ హారర్-కామెడీ సినిమాలో అనీత్ పడ్డా, నానా పటేకర్‌లతో పాటు విశాల్ జెత్వా, వినీత్ కుమార్ సింగ్, సీమా బిస్వాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సినిమా కథ, నానా పటేకర్ పాత్రకు సంబంధించిన వివరాలను సినిమా యూనిట్ ఇంకా రహస్యంగానే ఉంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+