నానా పటేకర్ ప్రేమకథలో ఇద్దరు హీరోయిన్లు.. బాలీవుడ్‌ను షేక్ చేసిన లవ్ ట్రయాంగిల్!

బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ కేవలం ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకే కాకుండా తోటి బాలీవుడ్ నటీమణులతో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్ల కూడా వార్తల్లో నిలిచేవారు. 90ల కాలంలో నానా పటేకర్, ప్రముఖ నటి మనీషా కొయిరాలాల మధ్య సాగిన ప్రేమాయణం అప్పట్లో సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి ప్రేమకథ గురించి ఎన్నో ఊహాగానాలు వచ్చినప్పటికీ.. చివరికి వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేకపోయింది.

నానా పటేకర్‌ చివరి సినిమా రిలీజ్ వాయిదా.. ఎందుకంటే?
నానా పటేకర్‌ చివరి సినిమా రిలీజ్ వాయిదా.. ఎందుకంటే?

ప్రేమాయణం ప్రారంభం
1996లో వచ్చిన 'అగ్నిసాక్షి' సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్, మనీషా కొయిరాలాల మధ్య పరిచయం ఏర్పడింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. నానా పటేకర్ అప్పటికే వివాహితుడైనప్పటికీ.. ఆయనపై ఉన్న ప్రేమతో మనీషా కొయిరాలా ఈ బంధాన్ని కొనసాగించారు. కానీ నానా పటేకర్ మనీషా విషయంలో తీవ్రమైన పొసెసివ్‌నెస్‌తో ఉండేవారు. మనీషా గ్లామరస్ లేదా రివీలింగ్ దుస్తులు ధరించడం, అలాగే సినిమాల్లో ఇంటిమేట్ సీన్లలో నటించడం ఆయనకు నచ్చేది కాదు. ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ మనస్పర్థలు, గొడవలు జరిగేవి.

Nana Patekar Love Triangle Manisha Koirala Ayesha Jhulka and The Breakup Story Full Details Here

ఆయేషా జుల్కాతో పరిచయం
ఓ వైపు మనీషాతో విభేదాలు వస్తున్న సమయంలోనే నానా పటేకర్ నటి ఆయేషా జుల్కాకు దగ్గరవుతున్నారనే ప్రచారం మొదలైంది. ఓ సందర్భంలో మనీషా కొయిరాలా నేరుగా నానా పటేకర్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన ఆయేషా జుల్కాతో ఉన్న సన్నివేశాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని ఊహాగానాలు వచ్చాయి. ఆ సమయంలో మనీషా ఆయేషాతో ఘర్షణకు దిగి.. 'నా మనిషికి దూరంగా ఉండు' అని హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది.

35 ఏళ్లుగా భార్యకు దూరంగా.. అయినా నానా పటేకర్ విడాకులు ఎందుకు తీసుకోలేదంటే?
35 ఏళ్లుగా భార్యకు దూరంగా.. అయినా నానా పటేకర్ విడాకులు ఎందుకు తీసుకోలేదంటే?

ఆయేషా జుల్కా వివరణ
అయితే ఈ ఆరోపణలను నటి ఆయేషా జుల్కా తన ఇంటర్వ్యూలలో పూర్తిగా ఖండించారు. నానా పటేకర్, మనీషాల బ్రేకప్ కు తాను ఏ మాత్రం కారణం కాదని స్పష్టం చేశారు. నానా పటేకర్ తనకు కేవలం ఓ నటుడిగా, వృత్తిపరంగా మాత్రమే మంచి సంబంధం ఉందని తెలిపారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ.. ఆ సమయంలో నిజంగా ఏం జరిగిందనేది మాత్రం వారి ముగ్గురికి తెలుసు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+