ఇక మాటల్లేవ్.. నితిన్ - రోహిత్ పెళ్లిళ్లతో బయటపడ్డ "నందమూరి- నారా" విభేధాలు !!
నందమూరి - నారా కుటుంబాలకు అటు రాజకీయంగా.. ఇటు సినిమాల పరంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. అయితే రెండు కుటుంబాల మధ్య అప్పుడప్పుడు కాస్త విభేధాలు బయటపడ్డ తర్వాత కలిసిపోయేవారు. హరికృష్ణ మరణించిన తర్వాత రెండు కుటుంబాలు మళ్లీ ఒకటయ్యాయి.
బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ సందర్భంగా ఈవెంట్ లో అందరూ కలసి కనిపించారు. మళ్లీ ఆ తర్వాత నుంచి బాలయ్య - ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి కనిపించలేదు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో సైతం ఎడమొహం, పెడమొహం గానే ఉన్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ బాగున్నారు కానీ.. వారితో బాలయ్య మంచిగా ఉండడం లేదని.. దూరం పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా బాలయ్య సిల్వర్ జూబ్లీ వేడుకల్లో, ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ పాల్గొనకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దాంతో బాబాయ్ - అబ్బాయిల మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. కానీ అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మాత్రం పలు కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు.
ఇక ఈ మధ్య ఈ పరిస్థితులు మరింత ముదిరినట్టు కనబడుతోంది. రీసెంట్ గానే ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రాన్ని చూడలేదంటూ నారా రోహిత్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. అలానే రీసెంట్ గా హీరో నారా రోహిత్ - శిరీష పెళ్లి వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహానికి సీఎం చంద్రబాబు, బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ కి చెందిన పలువురు ప్రముఖులు సైతం హాజరయ్యారు. కానీ కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఈ పెళ్లికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అసలు నారా రోహిత్ వారిని ఆహ్వానించారా? లేదా.. ఇన్విటేషన్ ఇచ్చినా కూడా అన్నదమ్ములు హాజరు రాలేదా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు రీసెంట్ గానే ఎన్టీఆర్ బావ మరిది, హీరో నార్నె నితిన్ వివాహం జరిగింది. ఆ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. ఎన్టీఆర్ దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపించారు. కళ్యాణ్ రామ్ సైతం తారక్ తో పాటే ఉన్నారు కానీ నారా, నందమూరి కుటుంబాల్లో ఇంకెవరూ హాజరు కాకపోవడం గమనార్హం. సీఎం చంద్రబాబుకు కుటుంబం పరంగా నార్నే ఫ్యామిలీ క్లోజ్ అని అందరికీ తెలిసిందే. దాంతో ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం పెద్ద చర్చకు తెరలేపింది.
మొత్తానికి ఈ రెండు పెళ్లి వేడుకలతో మరోసారి కుటుంబాల్లో ఉన్న విభేదాలు బయటపడ్డాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మారి రానున్న రోజుల్లో అయిన బాబాయ్ - అబ్బాయిలు కలిసిపోతారా.. లేక ఈ గ్యాప్ ఇంకా పెరుగుతుందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications