బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు ఆ ఇద్దరికీ ఆహ్వానం లేదు?
నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఈనెల 30వ తేదీతో 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటారు. అప్పటి నుంచి ఆయన నిరాటంకంగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించడమే కాకుండా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా హ్యాట్రిక్ విజయాలు సాధించి మంచి జోష్ మీద ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఆయన్ను సత్కరించాలని సినీ పరిశ్రమ భావించింది.
సెప్టెంబరు ఒకటోతేదీ సాయంత్రం ఆరు గంటలకు
తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ తోపాటు వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు సునీల్ నారంగ్, టి.ప్రసన్నకుమార్, వల్లభనేని అనిల్ బాలకృష్ణతో సమావేశమయ్యారు. వేడుకలు జరిపేందుకు అనుమతించాలని కోరగా బాలయ్య అంగీకరించారు. సన్మాన వేడుకకు తెలుగు పరిశ్రమతోపాటు ఇతర భాషలకు చెందిన ప్రముఖులు కూడా భారీసంఖ్యలో హాజరుకాబోతున్నారు. సెప్టెంబరు ఒకటోతేదీ సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమయ్యే వేడుకలు ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

తారక్, కల్యాణ్ రామ్ రారు..
ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డితోపాటు పవన్ కల్యాణ్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు, రాజకీయ నాయకులు హాజరుకాబోతున్నారు. అయితే ఈ వేడుకకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ కు ఆహ్వానం లేదని అంటున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటివారు చంద్రబాబు, బాలయ్య కుటుంబాలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వీరు తారక్ కు సన్నిహితులు. వీరిని ఎన్టీఆర్ నియంత్రించలేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో స్పందించలేదు. మౌనంగా ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు బాలయ్య అభిమానులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం తారక్ ట్వీట్ చేయగా దానికి చంద్రబాబు బదులిచ్చారు. తారక్ బాటలోనే కల్యాణ్ రామ్ కూడా కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఒకేమాటమీద ఉండటంతో ఆహ్వానం ఉండదని భావిస్తున్నారు. ఉన్నా వారు రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో ఈ వేడుక ప్రారంభంకానుంది. 50ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ 109 సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. ఆయన సరసన 129 మంది హీరోయిన్స్ ఆడిపాడారు. భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్‌తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది. సోషల్, మైథలాజికల్, హిస్టారికల్, బయోపిక్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానర్స్‌లో నటించిన రికార్డు బాలయ్యకు ఉంది.












Click it and Unblock the Notifications