బిగ్ బ్రేకింగ్ : బాలయ్య "అఖండ 2" రిలీజ్ వాయిదా...
ఈలలు వేస్తూ, కేకలు వేయాల్సిన గొంతులు మూగుబోయాయి. సోషల్ మీడియాలో కోడై కూస్తున్న గుసగుసలు నిజమయ్యాయి. మొత్తానికి నందమూరి అభిమానుల హార్ట్ బ్రేక్ అయ్యింది. నటసింహం నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన "అఖండ 2" సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా.. అనివార్య కారణాల వల్ల 'అఖండ 2' షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని తెలియజేయడానికి చింతిస్తున్నామని పేర్కొంది. ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి ఈ నిర్ణయం బాధ కలిగిస్తుందని.. కానీ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని పోస్ట్ చేసింది. ఈ అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు అని.. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరమని వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

కాగా ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా.. సంయుక్త హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించగా.. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అఖండ' మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే 'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. గతంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో కలిసి ఈరోస్ సంస్థ మహేశ్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలను నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే.. 14 రీల్స్ ప్లస్ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టులో ఆరోపించింది. ఆ మొత్తం చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది.
With a heavy heart, we regret to inform you that #Akhanda2 will not be releasing as scheduled due to unavoidable circumstances.
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025
This is a painful moment for us, and we truly understand the disappointment it brings to every fan and movie lover awaiting the film.
We are working…
-
రోషన్ తో లవ్..?? ఓపెన్ అయిన 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
"20 ఏళ్ల క్రితం మీ అమ్మను చూసుంటే పెద్ద హీరోయిన్ ను చేసేవాడ్ని" -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్












Click it and Unblock the Notifications