ఊహించని మల్టీస్టారర్... బాలయ్యతో మరో స్టార్ హీరో?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న ఫామ్ లో ఏ అగ్ర కథానాయకుడుకానీ, పాన్ ఇండియా స్టార్ హీరోలుకానీ లేరు. తాతమ్మ కల సినిమాతో పరిశ్రమలోకి ప్రవేశించి ఈనెల 30వ తేదీకి 50 సంవత్సరాలు పూర్తికాబోతున్నాయి. వచ్చేనెల ఒకటోతేదీన 50 ఏళ్ల వేడుక హైదరాబాద్ లో జరగబోతోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించగా, తండ్రి తారకరామారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అరుదైన రికార్డులతో జోరుమీద ఉన్న బాలయ్య త్వరలోనే ఓ స్టార్ యువహీరోతో కలిసి నటించబోతున్నాడు.
రామ్ తో మంచి స్నేహం
ఆ యువ హీరో ఎవరో కాదు.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. వీరిద్దరికీ పరిశ్రమలో మంచి స్నేహం ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఇద్దరూ స్నేహితుల్లా మసలుకుంటారు. రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ ఈనెల 15వ తేదీన విడుదల కాబోతోంది. దీనితర్వాత మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య సినిమా వేడులకు రామ్, రామ్ సినీ వేడుకలకు బాలయ్య హాజరవుతుంటారు. అంత స్నేహంగా కలిసిమెలిసి ఉండే వీరిద్దరితో సినిమా తీయాలని ఇద్దరు దర్శకులు ప్రయత్నించి విజయవంతమయ్యారు.

గోపీంద్ కు గతంలోనే మాటిచ్చిన బాలయ్య
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కథ కూడా ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకులుగా ఇద్దరి పేర్లు వినపడుతున్నాయి. ఒకరు బోయపాటి శ్రీను కాగా, మరొకరు మలినేని గోపీచంద్. రామ్ బోయపాటి దర్శకత్వంలో స్కంద చేసి ఘోర పరాజయాన్ని మూట్టకట్టుకున్నారు. బోయపాటి బాలయ్యతో అఖండ 2 తీయబోతున్నారు. అలాగే గోపీచంద్ తో కూడా ఓ సినిమా చేస్తానని, మైత్రీ బ్యానర్ పై చేద్దామని వీరసింహారెడ్డి సినిమా సమయంలోనే బాలయ్య మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే చేస్తున్నప్పటికీ మల్టీస్టారర్ గా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శకులుగా వీరిద్దరిలో ఎవరనే విషయం మాత్రం త్వరలోనే తేలనుంది.












Click it and Unblock the Notifications