శభాష్ బాలయ్య.. అందరూ భయపడుతున్న స్టార్ డైరెక్టర్ తో సినిమా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఆ డైరెక్టర్ అంటే.. అతనితో సినిమా అంటేనే భయపడుతున్న స్టార్ హీరోలంతా డేట్లు ఇవ్వడంలేదు.. అతనితో సినిమాకు ఓకే చెప్పడంలేదు. కానీ వరుసగా మూడు హ్యాట్రిక్ హిట్లు కొట్టి నాలుగో హిట్ కొట్టడానికి బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ మాత్రం భయపడలేదు. ఆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. కథ సిద్ధమైందా? సిద్ధమవ్వాలా? అనేదానిపై స్పష్టత వస్తే సినిమా ప్రారంభించడమే తరువాయి అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.
అందరు హీరోలు భయపడుతున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరు కారం సినిమాతో విపరీతంగా ట్రోలింగ్ కు గురైన త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడటంలేదు. తన తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నారో ఇంతవరకు స్పష్టత లేదు. ఈ సినిమా ఫ్లాప్ ప్రభావం అల్లు అర్జున్ పై పడిందా? లేదా? అనేది తెలియడంలేదు. పుష్ప2 పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ భారీ బడ్జెట్ చిత్రం చేయాల్సి ఉంది. మరోవైపు అట్లీ కూడా బన్నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ ఇద్దరిలో అతను ఎవరివైపు మొగ్గుచూపుతాడో స్పష్టత రావడంలేదు.

మరోవైపు సూర్యతో అని, నానీతో అని, వెంకటేష్ తో అని.. త్రివిక్రమ్ తర్వాత సినిమాపై వార్తలు వస్తున్నాయి. అయితే నందమూరి బాలకృష్ణతో త్రివిక్రమ్ తన తర్వాత సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథను సిద్ధం చేయాల్సి ఉందని చెబుతున్నారు. బాబీతో సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ బోయపాటితో అఖండ2 చేయాల్సి ఉంది. దాని తర్వాత త్రివిక్రమ్ తో ఉంటుందా? లేదంటే దానికంటే ముందు ఉంటుందా? అనేదానిపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. మాటల మాంత్రికుడు బాలయ్యతో ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో అనే ఉత్కంఠతో నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications