బాలయ్య - వెంకటేష్ కాంబోలో మల్టీస్టారర్... స్వయంగా ప్రకటించిన వెంకీ

నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ విషయాన్ని వెంకీయే స్వయంగా ప్రకటించారు. తాను చేయబోయే సినిమాలను వివరాలను చెబుతూ వెంకటేష్ బాలయ్యతో చేస్తున్నట్లు చెప్పారు. బాలయ్య అఖండ2 చేస్తున్నారు. బోయపాటి శ్రీను దీనికి దర్శకుడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీన్ని చాలా క్లీన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాలని త్రివిక్రమ్ ఆలోచన. ఈ సినిమా తర్వాత వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

బాలయ్యతో చేసే సినిమా ఏది?
ప్రస్తుతం చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలో వెంకీ క్యామియో రూల్ చేస్తున్నారు. ఇన్ స్పెక్టర్ గా పాత కేసులో చిరంజీవిని పట్టుకునే పాత్ర పోషిస్తున్నాడు. సీరియస్ గా ఉంటూనే, కామెడీని కూడా మిక్స్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాలయ్యతో చేయబోయే సినిమా ఏదనేది స్పష్టత ఇవ్వలేదు. సినిమా మాత్రం చేస్తున్నట్లు వెంకీ స్వయంగా ప్రకటించాడు. గోపీచంద్ మలినేని సినిమాలో ఏమైనా క్యామియో రూల్ పోషిస్తున్నాడా? అనే సందేహం అభిమానుల్లో ఉంది. అయితే మలినేని తర్వాత బాలయ్య క్రిష్ దర్శకత్వంలో తనయుడు మోక్షజ్ఞతో మల్టీస్టారర్ చేస్తున్నారు. మరి వెంకీతో సినిమాకు దర్శకుడు ఎవరు? ఎవరు నిర్మిస్తున్నారు? వివరాలు మాత్రం తెలియరాలేదు.

nandamuri Balakrishna and victory venkatesh combination movie details here

వీరిద్దరి కాంబోలో ఇదే మొదటి చిత్రం
బాలకృష్ణ - వెంకటేష్ కలిసి నటిస్తే ఇదే వారి మొదటి చిత్రం అవుతుంది. వీరిద్దరి కాంబోలో గతంలో ఎన్నోసార్లు సినిమాలు తీయడానికి ప్రయత్నాలు జరిగాయికానీ కుదర్లేదు. ఇప్పుడు కుదురుతోంది. బాలయ్య యాక్షన్, వెంకీ ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ కలిస్తే సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుందంటున్నారు. మరి వీరిద్దరినీ కలిపి సినిమా తీయబోతున్న దర్శకుడెవరు? నిర్మాత ఎవరు? అనేది వివరాలు బయటకు రానివ్వడంలేదు. త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏకమైనప్పటికీ వీరిద్దరినీ కలిసి ఒకేసారి వెండితెరపై చూడబోతున్నారు సినీ ప్రియులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+