ఈ బాలయ్య బ్లాక్ బస్టర్లను కొట్టడం ఏ హీరోవల్లా కాదు
నందమూరి నట వారసత్వాన్ని ఐదు దశాబ్దాలుగా దిగ్విజయంగా, నిర్విరామంగా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. అభిమానులు ముద్దుగా నందమూరి నటసింహం అని పిలుచుకుంటారు. ఇటీవలే పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తన కెరీర్ లో బాలయ్య ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కొల్లి బాబీ దర్శకత్వంలో 109వ సినిమాను చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది విడుదల కాబోతోంది.
నందమూరి బాలకృష్ణ అంటే కంటిచూపుతోనే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తారు. ఒక్కసారి తను అడుగుపెడితే చరిత్ర పునరావృతమవుతుంది. తన కెరీర్ లో అనేక రికార్డులు నెలకొల్పినప్పటికీ కొన్ని చిత్రాలతో మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసి సంచలన రికార్డులను సొంతం చేసుకున్నారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. ఈ రికార్డులను అధిగమించడం ఏ హీరోవల్లా కాదని నందమూరి అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. నందమూరి నట వారసత్వాన్ని గత నాలుగు దశాబ్దాలకుపైగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. ఆయన కెరీర్లో 100కు పైగా చిత్రాల్లో నటించి అనేక రికార్డులు బద్దలుకొట్టారు. సోమవారం ఆయన బర్త్‌డే సందర్భంగా బాలయ్య ఆల్‌టైమ్ హిట్స్‌లో కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం.

తొలి టైమ్ ట్రెవల్ సినిమాగా తెరకెక్కిన ఆదిత్య 369 అనేక రికార్డులను బద్దలు కొట్టింది. సింగీతం శ్రీనివాసరావు దీనికి దర్శకుడు.సింగీతం దర్శకత్వంలోనే బాలయ్య చేసిన మరో సినిమా భైరవ ద్వీపం. ఈ సినిమాలో కురూపిగా నటించి మంచి మార్కులు కొట్టేశారు.ఫ్యాక్షనిస్టుగా సమరసింహారెడ్డి సినిమాలో తన విశ్వరూపాన్ని చూపించారు. వైట్ అండ్ వైట్ లో కనిపించిన బాలయ్యను చూడగానే థియేటర్లు ఊగిపోయేవి. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
బోయపాటితో తొలిసారి జతకట్టిన బాలయ్య క్లాస్, మాస్ యాక్షన్ తో చేసిన సింహా టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టారు.ఎప్పటికీ గుర్తుండిపోయే బాలయ్య సినిమాల్లో లెజెండ్ ఒకటి. ఆయన చెప్పిన డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా థియేటర్లలో ఈ సినిమా 400 రోజులకు పైగా ఆడింది. కర్నూలు జిల్లాలో 1000 రోజులు ఆడింది.
నాన్ స్టాప్ యాక్షన్ తో తెరకెక్కిన అఖండ సినిమాతో థియేటర్లు బద్దలయ్యాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన మూడో చిత్రం ఇది. కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.ఫ్యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య మరో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు 108 అడుగల కటౌట్ ను పెట్టి అభిమానాన్ని చాటుకున్నారు.












Click it and Unblock the Notifications