విడుదలకు ముందే 'అఖండ-2'తో బాలయ్య సంచలన రికార్డు
నందమూరి నటసింహం బాలకృష్ణ తన తోటి అగ్ర హీరోలకన్నా ఎంతో ముందున్నారు. అఖండ నుంచి డాకూ మహారాజ్ వరకు వరసగా అన్నీ బ్లాక్ బస్టర్లే. తాజాగా అఖండ2తో డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా రాబోతున్న ఈ సినిమాపై సినీ ప్రియుల్లోఅంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ ఒకదాన్ని మించి మరొకటి ఘనవిజయం సాధించాయి. అఖండ2 నాలుగో సినిమా.
తొలి పాన్ ఇండియా సినిమా
ఈ సినిమా విడుదలకు ముందే సంచలన రికార్డు నెలకొల్పింది. సినిమాపై ఉన్న క్రేజ్, హీరో-దర్శకుడి క్రేజీ కాంబినేషన్ కలిసి నిర్మాతలకు భారీ లాభాన్ని కళ్లచూపింది. ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.80 కోట్లకు దక్కించుకుంది. తెలుగులో ఇంత ధర దక్కిచుకున్నది నలుగురు హీరోలే. బాలకృష్ణ నుంచి తొలిసారిగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. హిందూ మతానికి సంబంధించిన అంశంతో, ఆధ్యాత్మిక భావాలతో కూడుకున్న చిత్రంగా వస్తుండటంతో కచ్చితంగా దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.

సమర్పకురాలిగా తేజస్విని
14 రీల్స్ ప్లస్ బ్యానరుపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలయ్య చిన్నకూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అఖండ2పై ముందునుంచి భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే డిసెంబరు వరకు వేచిచూడాల్సిందే. సినిమాను డిసెంబరులో విడుదల చేస్తున్నట్లు బాలయ్య ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వలో ఓ సినిమా చేయబోతున్నారు. దాని తర్వాత ఆదిత్య 999 సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications