హిందీలో బాలయ్య 'డాకూ మహారాజ్' దబిడి దిబిడే
కొల్లి బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన డాకూ మహారాజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన ఎనిమిది రోజులకే రూ.156 కోట్లు సాధించింది. సంక్రాంతి పండగ సమయంలో సీడెడ్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సినిమా చూసేందుకు అర్థరాత్రి కూడా ప్రత్యేక షోలు వేశారంటే బాలయ్య క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. సితార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించి ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని భావించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సినిమాను అదే పేరుతో హిందీలో కూడా విడుదల చేశారు.
హిందీ ప్రాంతంతోనే ముడిపడివుంది
వాస్తవానికి హిందీ బెల్టులో ముందుగా 200 థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నారు. అయితే పుష్ప2 వసూళ్లు నెమ్మదించడంతోపాటు తెలుగు నుంచి వచ్చే యాక్షన్ సినిమాలంటే ఉత్తరాది సినీ ప్రియులు ఆసక్తిగా ఉండటంతోపాటు పేరును డిస్ట్రిబ్యూషన్ సంస్థను సంప్రదించారు. దీంతో వారుకూడా అంగీకరించడంతో ఆ సంస్థ సహకారంతో 600 థియేటర్లలో భారీగా విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా దబిడి దిబిడిలాడించేస్తోందని వార్తలు వస్తున్నాయి. డాకూ మహారాజ్ నేపథ్యం కూడా హిందీ ప్రాంతంతో ముడిపడివుండటంతో కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

ఎంతమేరకు కలెక్షన్లు అనేది తేలాల్సి ఉంది
అందుకు తగినట్లుగానే అక్కడి ప్రేక్షకులకు నచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎంతమేరకు విజయం సాధిస్తుందనేది చూడాలి. సినిమా అక్కడ కూడా విజయవంతమైతే రూ.250 కోట్ల గ్రాస్ కు చేరుకునే అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యాజైశ్వాల్ నటించగా, బాబీ డియోల్ ప్రతినాయక పాత్ర పోషించారు. బోయపాటి శ్రీను ఒక్కడే బాలయ్యకు హిట్ ఇస్తాడు అనే ముద్ర తొలగిపోయింది. అఖండ తర్వాత వీరసింహారెడ్డితో గోపీచంద్ మలినేని, భగవంత్ కేసరితో అనిల్ రావిపూడి, డాకూ మహారాజ్ తో బాబీ సూపర్ హిట్లు ఇచ్చారు. దీనితర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండ2 చేస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా వస్తోందని సంగీత దర్శకుడు తమన్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications