దిల్ రాజు ప్రొడక్షన్‌లో బాలయ్య.. భారీ పాన్ ఇండియా మూవీ షూరు
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆయన ఎనర్జీ, మాస్ అప్పీల్ మరింత పెరుగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా 'అఖండ 2' విషయంలో వచ్చిన మిశ్రమ స్పందన అభిమానులను కాస్త ఆలోచనలో పడేసినా, బాలయ్య తన తదుపరి లైనప్‌తో ఆ లోటును భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో 'ది గ్రేట్ ఫాదర్', 'మిఖాయిల్' వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు హనీఫ్ అడెని.
ఇటీవల విడుదలైన 'మార్కో' చిత్రంతో ఆయన పేరు సౌత్ ఇండియా మొత్తం మారుమోగిపోయింది. హనీఫ్ సినిమాల్లో యాక్షన్ ఊరికే ఉండదు.. అది చాలా 'రా'గా, వయొలెంట్‌గా మరియు హైలీ స్టైలిష్‌గా ఉంటుంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు ఉన్న పవర్, హనీఫ్ అడెని స్క్రీన్ ప్రెజెంటేషన్ తోడైతే.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం.

భారీగా నిర్మిస్తున్న దిల్ రాజు
ఈ భారీ ప్రాజెక్ట్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు వార్తలు రావడం విశేషం. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, మలయాళ మేకింగ్ స్టైల్‌ను అద్ది పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.ఒక పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ లేదా హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతుందని టాక్. బాలకృష్ణను ఇప్పటివరకు మనం ఊర మాస్ గెటప్స్‌లో చూశాం. కానీ హనీఫ్ దర్శకత్వంలో ఆయనను అత్యంత స్టైలిష్‌గా, ఒక సరికొత్త ఇంటెన్సిటీతో చూడబోతున్నామని సమాచారం.
హనీఫ్ అన్నీ సిద్ధం చేశాడు
ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే, హనీఫ్ అడెని ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ పట్టాలెక్కితే, టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల లెక్కలు మారిపోవడం ఖాయం. ఒకరకంగా ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. హనీఫ్ బాలయ్యను ఎంత రఫ్ గా చూపిస్తాడనే దానిపైనే ఈ చిత్ర విజయం కూడా ఆధారపడివుంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications