చేతిలో పద్మ భూషణ్ అవార్డుతో బాలయ్య భావోద్వేగం

నట సింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన కొంత భావోద్వేగానికి లోనయ్యారు.

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో బాలయ్యతో పాటు నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు.

Nandamuri Balakrishna has received the prestigious Padma Bhushan award

పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి బాలయ్య తనదైన శైలిలో హాజరయ్యారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో కనువిందు చేశారు. దిల్లీలోని మాన్‌సింగ్‌ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్‌కు కుటుంబంతో కలిసి ఆయన బయలుదేరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారాయి.

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది జనవరి 26న బాలయ్యకు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య నటుడిగా యాభై ఏళ్ళ వేడుకను గత ఏడాది ఆగస్టు 30తో పూర్తి చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్‌ ఫిక్షన్‌, బయోపిక్‌.. ఇలా అన్ని జానర్లను టచ్‌ చేసిన ఏకైక అగ్ర నటుడిగా ఆయన నిలిచారు. రాజకీయ రంగంలో సైతం మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అటు సినిమాల్లోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+