ఛీ.. ఛీ.. 'పద్మ భూషన్' చేయాల్సిన పనులేనా ఇవి..? విమర్శల్లో బాలయ్య..!
నట సింహం, నందమూరి బాలకృష్ణ ఏది చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. అటు సినిమా అయినా ఇటు పాలిటిక్స్ అయినా ఆయన రూటే సెపరేటు అన్నట్లుగా సాగుతుంది. ఇక రియాల్టీ షోలు అయితే ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇలా ఏ రంగంలోనైనా తాను దిగనంత వరకే.. అన్నట్లు దూసుకెళ్తున్నారు బాలయ్య. ఈ క్రమంలో ఆయనకు పద్మ భూషన్ కూడా వచ్చింది. ఇది భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. ఇటీవల ఈ అవార్డును బాలయ్య తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా బాలయ్య చేసిన ఓ యాడ్.. ఇప్పుడు ఆయన్ను ట్రోలింగ్ లోకి లాగింది. దేశంలోనే మూడో అత్యున్నత అవార్డును అందుకున్న బాలయ్య.. ఇలా చేస్తారా ? అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఏమైందంటే.. తాజాగా ఒక లిక్కర్ (మద్యం) కంపెనీకి సంబంధించిన యాడ్‌లో బాలయ్య నటించారు. అది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో విమర్శలకు దారితీసింది.

మ్యాన్షన్ హౌజ్ అనే లిక్కర్ కంపెనీ బ్రాండ్ కు ప్రస్తుతం ఆయన ప్రచార కర్తగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక యాడ్‌ను షూట్ చేసి సంతోషంగా మద్యం తాగేయండి అంటూ వీడియో విడుదల చేశారు. ఇక బాలయ్యకు ఇష్టమైన బ్రాండ్ ఏదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమెరికా వెళ్లినా సరే తన వెంట మ్యాన్షన్ హౌస్ తీసుకుని వెళతారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చిన్న అల్లుడు చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో ఆయన ఏకంగా ఈ బ్రాండ్ పై యాడ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఈ యాడ్ లో బాలయ్య లుక్ అదిరిపోయింది. ఇక ఆహాలో ఆయన హోస్ట్ గా చేసిన 'అన్‌స్టాపబుల్' టాక్ షోకు మ్యాన్షన్ హౌస్ అడ్వర్ట్ టైజింగ్ పార్ట్ నర్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో బాలయ్య 'పద్మ భూషన్' అవార్డు తీసుకున్నాక ఇలాంటి పనులు చేయడం ఏంటని సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ట్రోలింగ్ చేస్తున్నారు.
మ్యాన్షన్ హౌస్ అంబాసిడర్‌గా బాలకృష్ణ #NBK #MansionHouse pic.twitter.com/ngcbVwfVaW
— Milagro Movies (@MilagroMovies) May 15, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ గేర్ లో బాలయ్య దూసుకెళ్తున్నారు. వరుసగా నాలుగు హిట్స్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపారు. ప్రస్తుతం బోయపాటితో అఖండ 2 సినిమా చేస్తున్నారు. గోపిచంద్ మలినేనితో మరో సినిమా ప్లాన్ చేశారు బాలయ్య. ఇక రజనీకాంత్- లోకేశ్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ చిత్రంలో బాలయ్య కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్.












Click it and Unblock the Notifications