భారీగా పెరిగిన బాలయ్య రెమ్యునరేషన్
ఒక్క సినిమా హిట్ అవగానే కొంతమంది హీరోలు అమాంతం రెమ్యునరేషన్ పెంచేస్తారు. ఆ తర్వాత ఫ్లాప్ లు ఎదురైనప్పటికీ తమ పారితోషికం మాత్రం తగ్గించరు. అక్కడి నుంచి కిందకు దిగడానికే ఒప్పుకోరు. ఇటువంటి వాతావరణంలో నిర్మాతల శ్రేయస్సు కాంక్షించేవారు అరుదుగా ఉంటారు.
గత హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒక్కరే సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా, ఒక్కరూపాయి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా సినిమా చేసిపెట్టేవారు. ఒక సినిమా పరాజయం పాలైతే వెంటనే ఆ నిర్మాత దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసునేవారు కాదు.

నిర్మాతల గురించి ఆలోచిస్తారు: ప్రస్తుత తరంలో నందమూరి బాలకృష్ణ ఒక్కరే నిర్మాతల గురించి ఆలోచిస్తారని చెప్పవచ్చు. ఆయన సినిమాలు హిట్టయినా పారితోషికం పెంచారు. అందుకే బాలయ్యతో సినిమాలు చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించరని చెప్పవచ్చు. తనకున్న క్రేజ్ ను, మార్కెట్ ను కూడా పట్టించుకోకుండా నిర్మాతలు ఇచ్చినంతే తీసుకునే అలవాటుంది. ప్రస్తుతం సీనియర్ హీరోల్ల్ మిగతా హీరోలెవరూ లేని ఫామ్ లో బాలకృష్ణ ఉన్నారు.
అడగకుండానే పెంచారు: అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుసగా రూ.100 కోట్లు వసూలు చేసిన హ్యాట్రిక్ చిత్రాల కథానాయకుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వరుస విజయాలతో ఆయన దూసుకుపోతున్నారు. ఆయనతో సినిమా చేసిన నిర్మాతలు లాభాలబాటలో ఉంటున్నారు. అందుకే ఆయన అడగకుండానే పారితోషికం పెంచేస్తున్నారు.

ఒకేసారి రూ.10 కోట్లు పెరిగింది: 'అఖండ' సినిమాకి బాలకృష్ణ తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.10 కోట్లు. ఆ సమయంలో బాలయ్య కంటే తక్కువ మార్కెట్ ఉన్నవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ పారితోషికం అందుకున్నప్పటికీ నందమూరి నటసింహం ఎప్పుడూ ఆ లెక్కలు పట్టించుకోలేదు. 'అఖండ' ఘన విజయం సాధించడంతో.. 'వీరసింహారెడ్డి' నిర్మాతలు రూ.14 కోట్లు ఇచ్చారు. అది కూడా విజయం సాధించడంతో 'భగవంత్ కేసరి' నిర్మాతలు రూ.14 కోట్లు ఇచ్చారు.
తర్వాత సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా రూ.28 కోట్లు అందుకోబోతున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నారు. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రూపంలో ఆయన సినిమాలు రూ.150 కోట్లకి పైగా బిజినెస్ చేస్తున్నాయి. అందుకే నిర్మాతలు అడగకకుండానే పారితోషికాన్ని పెంచుతున్నారు. 2021 లో వచ్చిన 'అఖండ'కి రూ.10 కోట్ల పారితోషికం అందుకోగా, రెండేళ్లలోనే అది రూ.28 కోట్లకి చేరింది అంటే ప్రస్తుతం బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications