రికార్డ్ ధరకు దాదా ప్రీ రిలీజ్ బిజినెస్? బాలయ్య మూవీకి ఎన్ని కోట్లంటే?
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న మూవీ దాదా. వీరశివారెడ్డి విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కావడంతో దాదాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసి దాదా టైటిల్ గ్లింప్స్‌తో ఈ హైప్ మరింత క్రియేట్ అయ్యింది. దీనికి తగినట్లుగానే దాదా మూవీ ప్రి రిలీజ్ బిజినెస్‌లో దుమ్మురేపుతోంది. తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
దాదాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ రోల్‌లో కనిపించనున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. పెద్ది ఫేమ్ వెంకట సతీశ్ కిలారు తన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై దాదా సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా.. కాంతార ఫేమ్ అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ తన మార్క్ పంచ్ డైలాగులను రాస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న దాదా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

బాలకృష్ణకు గాయం కావడంతో దాదా షూటింగ్‌కు మేకర్స్ బ్రేక్ ఇచ్చారు. ఇటీవల షూటింగ్‌ను పునరుద్ధరించగా.. బాలకృష్ణ లేకుండా కొన్ని సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న దాదాకు సంబంధించి కేవలం 20 నుంచి 25 రోజులు మాత్రమే చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్. అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టించాలని గోపీచంద్ భావిస్తున్నారు. దానికి సమాంతరంగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
బాలకృష్ణ లుక్, గెటప్‌తో దాదా మూవీ 1980ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్, మాఫియా మూవీగా తెరకెక్కుతోంది. బాలయ్య మార్క్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు సెంటిమెంట్ కూడా సమానంగా ఉండేలా గోపీచంద్ మలినేని కథ రాసుకున్నారట. గ్యాంగ్‌స్టర్‌గా, ఫ్యామిలీ మ్యాన్‌గా బాలయ్యను రెండు కోణాల్లో చూపించబోతున్నారట. అయితే తెర మీదకు వస్తేనే కానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
ఇదిలాఉండగా.. దాదా సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య క్రేజ్, గోపీచంద్ టేకింగ్ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా కంపెనీలు, నిర్మాతలు క్యూకడుతున్నారు. ఈ క్రమంలోనే దాదా మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్, శాటిలైట్, ఆడియో రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందట. ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. ఈ డీల్ విలువ 70 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. దాంతో ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.












Click it and Unblock the Notifications
