నాగార్జున వద్దంటే బాలయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

టాలీవుడ్‌లో ఒక హీరో వద్దనుకున్న కథ మరొక హీరో చేతికి వెళ్లి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం కొత్తేమీ కాదు. కథల ఎంపికలో దర్శకులు, నిర్మాతలు ఎంత పక్కాగా ఉన్నా.. కొన్నిసార్లు ఆయా పాత్రలకు ఏ హీరో సెట్ అవుతారో కాలమే నిర్ణయిస్తుంది. అటువంటి ఆసక్తికరమైన ఘట్టమే నాగార్జున, బాలకృష్ణల కెరీర్‌లోనూ ఒకటి చోటుచేసుకుంది. అక్కినేని నాగార్జున అంటే టాలీవుడ్‌లో ప్రయోగాలకు మారుపేరు. కమర్షియల్ చిత్రాలతో పాటు 'మన్మథుడు' తరహా రొమాంటిక్ కథలు, 'అన్నమయ్య' వంటి భక్తిరస చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. అయితే, నాగ్ కెరీర్‌లో వదులుకున్న ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా, నందమూరి బాలకృష్ణ ఖాతాలో పడి ఇండస్ట్రీ క్లాసిక్‌గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు.. దర్శకేంద్రుడి శిష్యుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'బొబ్బిలి సింహం'.

సినిమా నచ్చకపోతే అమీర్‌పేట్‌ లో గుండు కొట్టించుకుంటా.. హీరోయిన్ సంచలనం..!
సినిమా నచ్చకపోతే అమీర్‌పేట్‌ లో గుండు కొట్టించుకుంటా.. హీరోయిన్ సంచలనం..!

మొదట నాగార్జున దగ్గరకు

ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా కథను దర్శకుడు మొదట నాగార్జున వద్దకే తీసుకెళ్లారట. అయితే, ఆ సమయంలో కథలోని గంభీరత, భారీ డైలాగ్ డెలివరీ, ఊర మాస్ పవర్ ఉన్న ఆ క్యారెక్టర్‌కు తాను ఎంతవరకు న్యాయం చేయగలననే సందేహంతో నాగ్ ఆ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ కథ బాలకృష్ణ దగ్గరకు చేరింది. మాస్ క్యారెక్టర్లలో జీవించే బాలయ్య, 'బొబ్బిలి సింహం' కథను వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 1994లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజృంభించి, బాలయ్య కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ పాత్రలో ఆయన చూపించిన రౌద్రం, పవర్ ఇప్పటికీ అభిమానులకు కంటిముందే మెదులుతుంటాయి. ఈ సినిమా విజయాన్ని చూసి నాగార్జున కూడా ఒకానొక సమయంలో ఈ కథను మిస్ చేసుకున్నందుకు ఆశ్చర్యపోయారని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి.

ఇరగదీసిన టీజర్.. ఈ సినిమా పక్కా హిట్ బాసూ రాసిపెట్టుకోండి..!
ఇరగదీసిన టీజర్.. ఈ సినిమా పక్కా హిట్ బాసూ రాసిపెట్టుకోండి..!
Nandamuri Balakrishna scored an industry hit after Akkineni Nagarjuna turned it down

బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా

సెంటిమెంట్, మాస్ ఎలిమెంట్స్‌ సరిగ్గా కుదిరిన ఆ కథ బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కే పర్ఫెక్ట్‌గా సూట్ అయిందని, అందుకే ఆ స్థాయిలో విజయం సాధించిందని సినీ విశ్లేషకులు భావిస్తారు. ఏదేమైనా, ఒక హీరో వద్దనుకున్న కథ మరో హీరోను బాక్సాఫీస్ 'సింహం'గా నిలబెట్టడం టాలీవుడ్ రికార్డుల్లో నిలిచిపోయిన ఒక మధుర జ్ఞాపకం!. కొన్ని కొన్ని సార్లు కథలు వచ్చినా హీరోలు ఆ పాత్రలకు తాము న్యాయం చేయమని, ఫలానా హీరో అయితే సరిగ్గా సెట్ అవుతారంటూ హీరో పేరు చెప్పి మరీ ఇప్పటి హీరోలు దర్శకులను పంపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+