బాలకృష్ణ సన్సేషనల్ రికార్డ్... టాలీవుడ్ లో ఏ హీరో కొట్టలేడు!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్నారు. వరుసగా మూడు సినిమాల హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇటువంటి అరుదైన ఘనత బాలయ్య సొంతమైంది. ఈ ఏడాదిలో సంక్రాంతికి వీరసింహారెడ్డి, విజయదశమికి భగవంత్ కేసరితో రెండు వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి ఈ సినిమా చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో పోటీపడి సూపర్ హిట్ కొట్టింది.
బాలయ్య కెరీర్ లోనే ఎన్నడూ లేనివిధంగా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఒకరకంగా ఇది సంచలన రికార్డు అని చెప్పొచ్చు.బాలయ్యకు కంచుకోట అయిన రాయలసీమలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఈ మూడు సినిమాలు అదిరిపోయే వసూళ్ళు రాబట్టాయి. అఖండ కర్నూలు జిల్లాలోనే ఏకంగా మూడు సెంటర్లలో వంద రోజులు, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 200 రోజులు ఆడింది. వీరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని ఆలూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్ లో 100 రోజులు ఆడింది.

ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డి 365 రోజుల దిశగా దూసుకుపోతోంది. ఆలూరు లోని శ్రీ లక్ష్మీనరసింహ థియేటర్లో ఈ సినిమా ఇప్పటికీ 320 రోజులు పూర్తి చేసుకుంది. వచ్చే సంక్రాంతి వరకు ఈ సినిమా థియేటర్లలో రన్ అయితే ఏడాదిపాటు ఆడిన అరుదైన ఘనత బాలయ్య ఖాతాలో పడుతుంది. సింహ, లెజెండ్ లాంటి సినిమాలతోపాటు గతంలో ఎన్నో సినిమాలు 365 రోజులు ఆడాయి. తాజాగా వీరసింహారెడ్డి ఈ అరుదైన రికార్డు నమోదు చేయబోతోంది. టాలీవుడ్ లో ఒక హీరో నటించిన ఇన్ని సినిమాలు 365 రోజులు ఆడిన రికార్డులు ఎవ్వరికీ లేవు. బాలయ్య దరిదాపుల్లో ఎవ్వరూ లేరని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications