బాలయ్య కెరీర్‌లో టాప్-5 చిత్రాలు
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ జన్మదిన జూన్ 10న. ఆరోజు అభిమానులకు పండగ రోజు. తన సుదీర్ఘమైన సినీ కెరీర్ లో ఎన్నో చిత్రాలు చేసినప్పటికీ, ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినప్పటికీ ఆయన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాలు ఐదు ఉన్నాయి. అవి ఎంత కలెక్షన్లు రాబట్టాయి? ఎంత లాభం వచ్చింది? అనే వివరాలను తెలుసుకుందాం.
బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమా 'వీర సింహా రెడ్డి'. సంక్రాంతి సందర్భంగా 2023లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.135 కోట్ల గ్రాస్ సాధించి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చింది. షేర్ రూ.80 కోట్లు వచ్చింది.

బాలకృష్ణ కెరీర్‌లో మొదటి రూ.100 కోట్ల చిత్రం 'అఖండ'. ద్విపాత్రాభినయం చేశారు. కరోనా తర్వాత ప్రేక్షకులు ట్రాక్టర్లు వేసుకొని మరీ థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూశారు. 'సింహ', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హ్యాట్రిక్ చిత్రం అఖండ. రూ.50 కోట్ల బడ్జెట్ తో తీయగా రూ.130 కోట్లు సాధించింది. అఘోరాగా బాలయ్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా కంటెంట్ మీద నమ్మకంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో 'భగవంత్ కేసరి' చేశారు. అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు అందులో ఉన్నాయి. వయసుకు తగ్గ పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల గ్రాస్ వసూళ్లూ వచ్చాయి.
ప్రస్తుతం మనకు ఉన్న కథానాయకుల్లో ఏ జానర్ లోనైనా సినిమా చేయగలిగిన హీరో బాలయ్య ఒక్కడే. తన వందో సినిమాగా చారిత్రక కథతో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దర్శకుడు క్రిష్. చిత్రం బడ్జెట్ రూ.45 కోట్లు. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
బాలయ్య స్థాయికి తగిన సినిమాలు రావడంలేదంటూ అభిమానులు నిరాశగా ఉన్న సమయంలో లెజెండ్ వచ్చి అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. బాలయ్య తన సత్తా ఏమిటో నిరూపించాడు. రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే సింహా సినిమా కూడా రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది.












Click it and Unblock the Notifications