బాలయ్య - కొరటాల శివ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ..!
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది "అఖండ 2" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టారు. ప్రస్తుతం గతంలో 'వీరసింహారెడ్డి' వంటి మాస్ హిట్ అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే మరో మూవీ చేస్తున్నారు. NBK 111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. మరోసారి తమన్ సంగీతం అందించబోతున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే తన నెక్స్ట్ చిత్రాన్ని డైరెక్టర్ కొరత శివతో కమిట్ అయ్యారు బాలయ్య. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొనగా.. ఒక్కో అప్డేట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి తమిళ సంగీత సంచలనం Anirudh Ravichander సంగీతం అందిస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీలో హీరోయిన్ ఎంపికపై ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

బాలయ్యకి జోడీగా బాలీవుడ్ స్టార్..
బాలకృష్ణకి జోడీగా బాలీవుడ్ స్టార్ Vidya Balan ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది నిజమైతే దాదాపు ఏడేళ్ల తర్వాత ఆమె మళ్లీ బాలకృష్ణతో స్క్రీన్ పంచుకోబోతున్నారు. గతంలో 'NTR బయోపిక్'లోని 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాల్లో వీరి కాంబినేషన్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో ఉండే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ 'ఊరమాస్' లుక్‌లో కనిపిస్తారని, విద్యాబాలన్ పాత్ర కూడా కథను మలుపుతిప్పేలా కీలకంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
విలన్‌గా సంజయ్ దత్?
మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ Sanjay Dutt విలన్‌గా నటించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే సినిమా పాన్-ఇండియా స్థాయిలో మరింత బలపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను రూపొందించనున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా, పొలిటికల్ ఎలిమెంట్స్.. ఇలా అన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌గా ఈ చిత్రం ఉండబోతోందని టాక్.












Click it and Unblock the Notifications