సినిమా ఫ్లాపైతే బాలయ్య ఏం చేస్తారో తెలుసా?
అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ ఉన్నంత జోరుమీద మిగిలిన హీరోలు లేరు అని చెప్పొచ్చు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కన్నా బాలయ్య భారీ హిట్లు కొడుతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టి బాబీ దర్శకత్వంలో చేస్తున్న తన 109వ సినిమాకూడా బ్లాక్ బస్టర్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో ఈ సినిమాలో బాలయ్య లేని సన్నివేశాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి షూటింగ్ లో జాయిన్ అవబోతున్నాడు.
బాలయ్యను అందరూ దర్శకుల హీరో అంటుంటారు. ఒకసారి కథ చెప్పిన తర్వాత అందులో జోక్యం చేసుకోరు. దర్శకుడు ఏది చెబితే అదే చేస్తారు. అంతేకానీ తనకు అది కావాలి.. తనకు ఇది కావాలంటూ దర్శకుల దగ్గర నస పెట్టరు. కథ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత అందులో ఎటువంటి మార్పులకు పట్టుబట్టరు. హీరో అన్న తర్వాత ప్రతి సినిమా హిట్ కావాలన్న రూలేమీ లేదు. ఫ్లాప్ కూడా అవుతాయి. విజయం దగ్గరే అపజయం ఉంటుంది. అయితే సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎంతోమంది హీరోలు దర్శకులపై విరుచుకుపడుతుంటారు. అనవసరంగా మాట్లాడుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తుంటారు. బాలయ్య మాత్రం నిర్మాతనుకానీ, దర్శకుడినికానీ.. చిత్ర యూనిట్ కు సంబంధించినవారినెవరినీ ఒక్క మాట కూడా అనరు.

మన ప్రయత్నం మనం చేశామని, అయితే సినిమా ప్రజలకు నచ్చలేదని, మరోసారి ప్రయత్నిద్దామంటూ పాజిటివ్ గా స్పందింస్తారు. దర్శకుడిని ఒక్క మాట కూడా కించపరిచేలా మాట్లాడరు. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది హీరోలు స్టేజ్ పైనే దర్శకులను పరోక్షంగా ఎలా విమర్శిస్తారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే నందమూరి బాలకృష్ణకు మాత్రం అటువంటి అలవాటు లేదంటూ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. దటీజ్ నందమూరి బాలయ్య అంటూ ఈ వార్తను సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications