మోక్షజ్ఞ ఎంట్రీతో రెండుగా చీలనున్న నందమూరి ఫ్యామిలీ?
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడు. అతన్ని పరిశ్రమకు పరిచయం చేసే బాధ్యతను బాలయ్య హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మకు అప్పజెప్పాడు. పురాణాల ఆధారంగా కథ ఉంటుందని అంటున్నారుకానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటూ వస్తోన్న వార్తలకు ఎట్టకేలకు చెక్ పడినట్లైంది. మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంతో నందమూరి కుటుంబం రెండుగా చీలిపోనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు నందమూరి తారకరామారావు మూల స్తంభమని చెప్పొచ్చు.
రెండు, మూడు తరాలవారిగా
చెన్నైలో ఉండిపోకుండా తెలుగు పరిశ్రమ ప్రత్యేకంగా విరాజిల్లాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంతో కష్టించి మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఎన్టీఆర్ వారసుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన నందమూరి బాలకృకష్ణ కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నారు. వరుసగా హ్రాట్రిక్ విజయాలు సాధించి ప్రస్తుతం తన 109వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఎన్టీఆర్ మొదటి తరం కాగా, రెండోతరంగా బాలయ్య కొనసాగుతున్నారు. మూడోతరంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కొనసాగుతున్నారు.

మౌనంగా ఉండటంపై ఆగ్రహం
తారక్ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలవుతోంది. కెరీర్ మొదట్లో తెలుగుదేశం పార్టీ తనను భుజానికెత్తుకుంది. కాలక్రమంలో విభేదాలు తలెత్తడంతో టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో కూడా ఎన్టీఆర్ మౌనంగా ఉన్నారు. దీనికితోడు చంద్రబాబు, బాలయ్య, లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కొడాలి నాని, వల్లభనేని వంశీని అదుపులో పెట్టకపోవడంపై కూడా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా బాలయ్యవైపే ఉన్నారు. బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ అడుగు పెట్టగానే అతన్ని భుజానికెత్తుకుంటారుకానీ తారక్ ను మాత్రం దూరం పెడతారనే అర్థమవుతోంది. ప్రస్తుతం నందమూరి కుటుంబంలోని ఇతర సభ్యులతో తారక్, కల్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారు. మోక్షజ్ఞ అడుగుపెడితే ఎన్టీఆర్ కు ఇప్పుడు కాస్తో కూస్తో ఉన్న టీడీపీ ఫాలోయింగ్ కూడా తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హీరోగా మోక్షజ్ఞ విజయం దక్కించుకున్న వెంటనే తారక్ కు చెక్ పెడతారని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.












Click it and Unblock the Notifications