కుర్రాడు బాగున్నాడే... వైరలవుతున్న నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్, మతుకుమల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తన కుమారుణ్ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను బాలయ్య ప్రశాంత్ వర్మకు అప్పగించాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన కొత్త లుక్ ను దర్శకుడు షేర్ చేశారు.
చిరస్మరణీయంగా నిలిచిపోయేలా..
'యాక్షన్ కోసం సిద్ధమా?' అని పేర్కొనడంతోపాటు 'సింబా ఈజ్ కమింగ్' అనే హ్యాష్‌ట్యాగ్ ను జత చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న మోక్షజ్ఞ కొత్త లుక్ పై సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. బాలకృష్ణ అనుకున్న విజన్ కు అనుగుణంగా, చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మోక్జజ్ఞను పరిచయం చేయడం అనేది గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ప్రశాంత్ వర్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం మోక్షజ్ఞ నృత్యాలు, పోరాటాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. తొలి సినిమాకు రూ.20 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని తెలుస్తోంది.

ఇతిహాసాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని
మన పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి కొన్ని కీలకమైన పాయింట్లు తీసుకొని వాటి స్ఫూర్తితో నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ సినిమాగా ఇది రూపుదిద్దుకోబోతోంది. గతంలో మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 6వ తేదీన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దానికి కూడా మంచి స్పందనే వచ్చింది. ఎంతో స్లిమ్ గా కనిపించడంతోపాటు గ్లామర్ గా ఉన్నాడు. సినిమాకు మినిమం గ్యారంటీ ఉందంటున్నారు విశ్లేషకులు. సినిమా విడుదలైన తర్వాత బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులతోపాటు ఇతర హీరోలకు చెందిన అభిమానులు కూడా కచ్చితంగా ఈ సినిమా చూస్తారని, హిట్ నుంచి బ్లాక్ బస్టర్ స్థాయికి ఈ సినిమా వెళుతుందనే ఆశాభావాన్ని బాలయ్య అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఎప్పుడెప్పుడా అని మోక్షజ్ఞ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
-
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు?












Click it and Unblock the Notifications