నాని మూవీ ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌ చూశారా?.. తగలబడిపోతున్న యూట్యూబ్

మనకున్న సహజమైన నటుల్లో నాని ఒకరు. అందుకే ఆయనకు నేచురల్ స్టార అనే బిరుదును ఇచ్చేశారు. మన పక్కింటి కుర్రాడులా అనిపిస్తాడు. ఆయన నటన కూడా అంతే ఉంటుంది. సినీ పరిశ్రమలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ప్రవేశించి, బాపు, కృష్ణవంశీ,ఇతర దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి తర్వాత హీరోగా మారారు. చిన్న చిన్నగా మొదలుపెట్టి ఈరోజ టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్ అయ్యారు. అతి త్వరలోనే ఆయన స్టార్ హీరోగా మారబోతున్నారని తాజాగా విడుదలైన 'ది గ్లింప్స్' టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఎంత క్రూరంగా ఉన్నాడో
తనకు మొదటిసారి రూ.100 కోట్ల సినిమా అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. సికింద్రాబాద్ నేపథ్యంలో కథ సాగుతుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాతోపాటు యూట్యూబ్ కూడా తగలబడిపోతోంది. ఎందుకంటే నానిని పరిచయం చేసిన విధానం అలా ఉంది. పెత్తందారులు అణిచివేస్తే, ఆ అణగదొక్కబడినవారిలో నుంచి వచ్చే నాయకుడు ఎంత క్రూరంగా ఉంటాడో నాని రూపంలో శ్రీకాంత్ చూపించబోతున్నాడు.

nani movie the pradise glimpse review

10 కేజీఎఫ్ లు, 10 పుష్ప2లు సరిపోవు
సినిమాలో బ్యాగ్రౌండ్ వాయిస్ ఓ లేడీ ఇచ్చారు. సినిమా విజువల్స్ తోపాటు, ఆమె వాయిస్ ద్వారా వచ్చే అసభ్య పదజాలం ఒకటి కూడా సహజంగానే అనిపించింది. ఆమె పలికిన ఆ పదజాలం నాని చేతిమీద టాటూ రూపంలో ఉంది. నాని ఎలివేషన్ ను దర్శకుడు ఆ విధంగా చూపించాడు. బీజీఎం ఇవ్వడంలో ముందుండే అనిరుధ్ అందించిన సంగీతంతోపాటు జీకే విష్ణు చిత్రీకరించిన విజువల్స్ ప్రేక్షకులను మరో లోకంలోకి కచ్చితంగా తీసుకువెళ్లేలా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నాని ఒక నియంతలా కనిపించాడు. ఈ చిత్రం కోసం అతని డెడికేషన్ కనపడింది. ఆ డెడికేషన్ అతన్ని ఈ స్థాయిలో నిలబెట్టడమే కాదు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లబోతోంది. నాని కనిపించిన విధానం మాత్రం వణుకు పుట్టిస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తే 10 కేజీఎఫ్ లు, 10 పుష్ప2లు సరిపోయేలా లేవని, పాన్ ఇండియా స్థాయిలో సంచలన చిత్రం కాబోతోందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+