ఈసారి ఒరిజినల్ చూపిస్తానంటున్న నాని.. హిట్ 3 టీజర్ రిలీజ్..
ఘంటా నవీన్ బాబు అంటే ఎవరికి తెలియక పోవచ్చు కానీ.. నేచురల్ స్టార్ నాని అంటే మాత్రం గుర్తుపట్టని వారు ఉండరు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు నాని. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత నుంచి తనదైన శైలిలో విభిన్న పత్రాలు పోషిస్తూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. అయితే హ్యాట్రిక్ హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న నాని.. ఈసారి రూట్ మార్చినట్టు తెలుస్తోంది. దసరా సినిమాలో మాస్.. హాయ్ నాన్నతో క్లాస్ ఆడియన్స్ ని అలరించిన నాని.. సరిపోదా శనివారంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కవర్ చేసి ఫుల్ మీల్స్ ఇచ్చారు. ఈసారి మాత్రం ఒరిజినల్ చూపిస్తానంటూ మరీ వాయిలెంట్ గా మారిపోయారు ఈ నేచురల్ స్టార్.

ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 థర్డ్ కేస్ మూవీలో నాని నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. టీజర్ ని గమనిస్తే.. ఈసారి వైలెన్స్ తో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయినట్టు కనిపిస్తోంది. హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్‌కు మించి అనేలా థర్డ్ కేస్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టుగా హిట్ 3 టీజర్ చూస్తే తెలుస్తోంది.
ముఖ్యంగా అర్జున్ సర్కార్‌గా నాని ఆటిట్యూడ్ అదిరిపోయింది. శ్రీనగర్ నేపథ్యంలో జరిగే ఈ కథలో ఒకేలా వరుస హత్యలు జరుగుతుండడం ఆ కేసును అర్జున్ సర్కార్‌కు అప్పగించడం టీజర్ లో చూడవచ్చు. ఎప్పుడూ లేనిది కొత్తగా ఈసారి నానితో బీప్ డైలాగ్స్ కూడా చెప్పించడం కొచెం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక టీజర్ లాస్ట్ లో నాని సూట్ తో ఎంట్రీ ఇవ్వడం.. రెండు ముక్కలుగా నరికేయడం అయితే పీక్స్ అంటున్నారు ఫ్యాన్స్. నాని ఈసారి ఊరమాస్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సమ్మర్ కానుకగా మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ డైరెక్షన్ లో 'ది ప్యారడైజ్', సుజీత్ డైరెక్షన్ లో కూడా ఒక మూవీ చేస్తున్నారు. నాని శేఖర్ కమ్ములతో ఓ మూవీ కోసం చేతులు కలపబోతున్నారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications