విజయ్ దేవరకొండ 'రణబాలి'పై మంత్రి నారా లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్!

ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన 'రణబాలి' సినిమా ట్రైలర్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. 1800ల కాలం నాటి రాయలసీమ నేపథ్యాన్ని, బ్రిటీష్ కాలం నాటి కరువు, అణచివేత పరిస్థితులను తెరపై ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ ట్రైలర్ ఓ అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని.. ఆ కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబించడంలో చిత్రబృందం చూపిన శ్రద్ధ అభినందనీయమని నారా లోకేష్ ప్రశంసించారు.

బా బా బ్లాక్ షీప్ రివ్యూ: నవ్వులు పూయించే డిఫరెంట్ క్రైమ్ కామెడీ!
బా బా బ్లాక్ షీప్ రివ్యూ: నవ్వులు పూయించే డిఫరెంట్ క్రైమ్ కామెడీ!

నారా లోకేష్ చేసి కామెంట్లపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెంటనే స్పందించింది. నారా లోకేష్ అభినందనలకు మైత్రి టీమ్ ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఈ కథకు పూర్తి జీవం పోసేందుకు చిత్రబృందం ఎంతో ప్రాణం పెట్టి పనిచేసిందని పేర్కొంది. ఈ సినిమా థియేటర్లలో కూడా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది.

Nara Lokesh Praises Vijay Deverakonda Ranabaali Trailer Mythri Movie Makers Responds with gratitude

నారా లోకేష్ కురిపించిన ప్రశంసలపై కథనాయకుడు విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. నారా లోకేష్‌ను 'లోకేష్ అన్నా' అని సంబోధిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ప్రత్యేకమైన సందేశాన్ని పంచుకున్నారు. తన పోస్ట్‌‌లో విజయ్ దేవరకొండ పేర్కొంటూ.. "సీమ నేల నాకు ఎంతో ఇచ్చింది. ఈ ప్రాంతం రుణం తీర్చుకోవడానికి నేను చేయాల్సిన బాధ్యతాయుతమైన సినిమా ఇది. లోకేష్ అన్నా.. మీరు పంపిన సందేశం మా చిత్రబృందంలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. మన నేల, మన ప్రజల సత్తాను చాటిచెబుతూ.. మనందరినీ గర్వపడేలా చేసే ఓ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతి థియేటర్లలో మీకు ఎదురుచూస్తోంది. మీ ప్రేమకు, అభినందనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని తెలిపారు.

ఫస్ట్ మూవీకి ముందే పాన్ ఇండియా ఛాన్స్.. రాకీ భాయ్‌తో టాలీవుడ్ డైరెక్టర్!
ఫస్ట్ మూవీకి ముందే పాన్ ఇండియా ఛాన్స్.. రాకీ భాయ్‌తో టాలీవుడ్ డైరెక్టర్!

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1800ల నాటి రాయలసీమలోని బ్రిటీష్ కాలపు కరువు, అణచివేత, ప్రజల పోరాటాలు ఈ సినిమాకు ప్రధాన నేపథ్యంగా నిలిచాయి. నారా లోకేష్ చేసిన కామెంట్స్ వల్ల ఈ చిత్ర చారిత్రక నేపథ్యంపై, నిర్మించిన సెట్టింగ్స్‌పై సినీ ఇండస్ట్రీలో మరింత ఆసక్తి పెరిగింది.

కాగా 'రణబాలి' సినిమాను అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన భారీ చిత్రం 'జైలర్ 2' అక్టోబర్ 15న థియేటర్లలోకి వస్తుండగా.. మరుసటి రోజే 'రణబాలి' రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ సినిమాల మధ్య పోటీ సినీ ప్రియులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+