హీరోయిన్‌ను నిశ్చితార్థం చేసుకున్న నారా రోహిత్ ..సీఎం చంద్రబాబు హాజరు
నారా వారి ఇంట పెళ్లి బజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో, ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు కొడుకు అయిన నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈక్రమంలోనే ఆయన తాను ప్రేమించిన అమ్మాయితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు.
నారా రోహిత్ గత కొంతకాలంగా ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు సిరి లేళ్ల. నారా రోహిత్ , సిరి లేళ్ల ఇద్దరు కలిసి 'ప్రతినిధి-2' సినిమాలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది.
ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఇద్దరూ కూడా కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఒకర్ని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఈ జంట భావించింది. ఈక్రమంలోనే ఆదివారం ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు ఫ్యామిలీతో పాటు, నందమూరి ఫ్యామిలీ హాజరై నారా రోహిత్ , సిరి లేళ్లను ఆశీర్వదించారు.ఇక నారా రోహిత్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు ఇండస్ట్రీలో నారా రోహిత్‌కు మంచి గుర్తింపు ఉంది.

పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ, చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తొలి సినిమా 'బాణం' నుంచి కూడా విభిన్న కథలున్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తన సినిమాలపై ఓ అటెన్షన్ క్రియేట్ చేశారు.సోలో,ప్రతినిధి, రౌడీఫెలో వంటి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ తర్వాతే నారా రోహిత్ కెరీర్ గాడి తప్పింది. ఆ మధ్య నారా రోహిత్ నటించిన సినిమాలు ఏమీ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేకపోయాయి. పైగా ఆయన నటించిన సినిమాలు ఎప్పుడొచ్చాయో కూడా తెలియని పరిస్థితి.
అయితే నారా రోహిత్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు చేస్తున్నారనే అపవాదు కూడా ఆయనపై ఉంది. 2014-2019 వరకు అత్యధిక సినిమాల్లో నటించిన నారా రోహిత్, 2019-2024కు వచ్చే సరికి ఆయన నటించిన సినిమాలను చేతి వేళ్ళ మీద లెక్కపెట్టే పరిస్థితి వచ్చింది. ఇక ఎన్నికల ముందు ఆయన నటించిన ప్రతినిధి-2 సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. నారా రోహిత్ ప్రస్తుతం సుందరకాండ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాతో అయినా నారా రోహిత్ కమ్‌బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.












Click it and Unblock the Notifications