నారా వారి ఇంట పెళ్లి సందడి.. పెళ్లి ముహూర్తంపై అధికారిక ప్రకటన

నారా వారి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యువ నటుడు నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. నటి సిరిలేళ్ల(శిరీష)తో గతేడాది అక్టోబరులో నిశ్చితార్థం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు , నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా జరిగింది. దీంతో నారా రోహిత్ పెళ్లి విషయంపై ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది. అయితే తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు నారా రోహిత్. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

నారా రోహిత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా సినిమాలు చేయడం ఆపేశాడు. తాజాగా భైరవం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నారా రోహిత్. నాంది చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో నారా రోహిత్ తో పాటు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. శుక్రవారం(మే 30) న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.

నారా రోహిత్ బాణం, సోలో, రౌడీఫెల్లో, ప్రతినిధి, ప్రతినిధి 2.. లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. తాజాగా భైరవం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే నారా రోహిత్ పెళ్లి విషయం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయన నిశ్చితార్థం జరిగి 6 నెలలు కావస్తున్నా.. పెళ్లి విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నారా రోహిత్ గుడ్ న్యూస్ చెప్పాడు.

Nara Rohit amp amp Sirisha to Tie the Knot This October

నారా రోహిత్, సిరిలేళ్ల(శిరీష) ల నిశ్చితార్థం గతేడాది అక్టోబరులో జరిగింది. అయితే ఆయన వివాహం కూడా ఈపాటికే జరగాల్సి ఉంది. కానీ నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్ లో కన్నుమూశారు. దీంతో పెళ్లి వేడుకను పోస్ట్ పోన్ చేసుకున్నాడు నారా రోహిత్. అయితే త్వరలోనే శిరీషతో ఏడడుగులు నడవనున్నట్లు వెల్లడించాడు నారా రోహిత్. ఈ ఏడాది అక్టోబర్‌లో సిరితో తన పెళ్లి చేసుకోబోతున్నట్టు రోహిత్ అధికారికంగా ప్రకటించాడు. హిందు సంప్రదాయం ప్రకారం తమ వివాహం ఉంటుందని పేర్కొన్నాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+