చిన్న సినిమాకి సపోర్ట్‌గా యంగ్ హీరోస్.. హిట్ కొట్టేనా ??
కొత్త నటీనటులు హరిష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక నటిస్తున్న చిత్రం "మరువ తరమా". ఈ సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ.. నవంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజుతో పాటు యంగ్ హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ మేరకు ఏపీ డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ .. ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నాను అని చైతన్య చెప్పినప్పుడు ఆలోచించుకోమని అన్నానన్నారు. టీజర్, ట్రైలర్ చాలా బాగా నచ్చాయని.. విజువల్స్ అద్భుతంగా అనిపించాయని తెలిపారు. నారా రోహిత్, శ్రీ విష్ణు స్నేహబంధానికి ప్రతీక అంటూ కొనియాడారు. వారిద్దరూ ఈ చిత్ర కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని చెప్పారు.

నారా రోహిత్ మాట్లాడుతూ .. 'మరువ తరమా' చిత్రం కంటెంట్ ఫ్రెష్‌గా అనిపిస్తోందన్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా బాగున్నాయని.. మంచి సినిమా వచ్చినప్పుడల్లా ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటారని అన్నారు. హరీష్ తనకు చాలా ఏళ్ల నుంచి మంచి మిత్రుడని.. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
అలానే శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. రోహిణి ఓ సినిమా చేశారంటే, పాత్రని ఒప్పుకున్నారంటే జనాలకు ఓ నమ్మకం ఉంటుందని వివరించారు. హరీష్ కోసమే మేం ఇక్కడకు వచ్చామని.. అతని టైమింగ్‌ని ఆడియెన్స్ ఇష్టపడతారన్నారు. డబ్బు కంటే పేరు కోసం ప్రయత్నిస్తున్న వారందరికీ తెలుగు ఆడియెన్స్ సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ మూవీని చూసి ఆదరిస్తారని, దీవిస్తారని కోరుకుంటున్నాను' అని అన్నారు.

చైతూ తన ఫ్రెండ్‌కి జరిగిన రియల్ స్టోరీనే 'మరువ తరమా'గా మార్చాడు. యూత్ ఆడియెన్స్‌కి ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. మనల్ని మనం చూసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. చైతన్య మంచి లిరిసిస్ట్. అందుకే ఈ సినిమాలో ప్రతీ చోటా పొయెట్రీ కనిపిస్తుందని హరీష్ మాట్లాడారు. డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి మాట్లాడుతూ .. ఈ ప్రయాణంలో ఎన్ని సవాళ్లు, సమస్యలు వచ్చినా వాటన్నంటినీ దాటుకుని ఇక్కడి వరకు రావడమే పెద్ద విజయం అని ఎమోషనల్ అయ్యారు.












Click it and Unblock the Notifications