సైకో కిల్లర్ గా మారిన యంగ్ హీరో.. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కొంతమంది సెలబ్రిటీలు తీసుకునే నిర్ణయాలు ప్రేక్షకులకు షాకింగ్ గా అనిపిస్తాయి. యంగ్ హీరోలు కూడా ఒక్కోసారి అలాంటి వైల్డ్ డెషిషన్స్ తీసుకుంటారు. ఇటీవలి కాలంలో యూత్ లో బాగా పాపులర్ అయిన కోలీవుడ్ యంగ్ హీరో నస్లేన్ గురించి తెలిసే ఉంటుంది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ అలరించాడు. కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దాంతో నస్లేన్ పేరు అందరికీ సుపరిచితం అయింది.
ఆ తర్వాత ఆలప్పుళా జింఖానా, లోకా చాప్టర్ 1 తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు మరింత దగ్గరయ్యాడు. ఇక లోక చాప్టర్ 1 మూవీ నస్లేన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే ఈ ఏడాది మోలీవుడ్ టైమ్స్ అనే సినిమాలోనూ కీలక పాత్ర చేశాడు నస్లేన్. సైకలాజికల్ డార్క్ కామెడీగా ఈ మూవీ తెరకెక్కింది. సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే హోమ్, తన్నీర్ మథన్ దినంగల్, జో అండ్ జో అనే సినిమాల్లోనూ నస్లేన్ తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. అయితే ప్రేమలు, లోకా చాప్టర్ 1 సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నస్లేన్ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. అయితే నస్లేన్ కెరీర్ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏ యంగ్ హీరో చేయని సాహసం చేసి విలన్ పాత్ర చేసేందుకు ముందుకొచ్చాడు. అది కూడా ఓ సీరియల్ కిల్లర్ క్యారెక్టర్.

చూడ్డానికి లవర్ బాయ్ లా ఉండే నస్లేన్ ఓ సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించడం ఇప్పుడు మాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ తొలినాళ్లలోనే ఇలాంటి పాత్రకు నస్లేన్ ఓకే చెప్పడం అంటే సాహసమనే చెప్పాలి. అయితే అందుకు కారణం లేకపోలేదు. ఆయన సీరియల్ కిల్లర్ పాత్ర చేసేది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో.. సాధారణంగా స్టార్ హీరో సినిమాల్లో నటించాలని కొత్త హీరోలకు ఉంటుంది. అందుకే సూర్య నటిస్తున్న సీన్ అనే సినిమాలో నస్లేన్ మోస్ట్ వైలెంట్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సీన్ మూవీ నుంచి రీసెంట్ గా విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
