'సరిపోదా శనివారం' రివ్యూ: నాని ఖాతాలో భారీ హిట్ పడిందా?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన చిత్రం సరిపోదా శనివారం. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. గతేడాది దసరా చిత్రంతో రూ.100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టినాని, తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సరిపోదా శనివారం డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో అంతకుముందు అంటే సుందరానికి సినిమా చేశాడుకానీ అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆత్రేయ మీద నమ్మకంతో మరో సినిమాకు అవకాశమిచ్చిన నాని సూపర్ హిట్ కొట్టాడా? లేదా? అనేది తెలుసుకుందాం. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాత.
ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. నాని, ఎస్ జే సూర్య పోటా పోటీగా నటించడమే ఇందుకు కారణం. ప్రతి చిన్న విషయానికి మితిమీరిన ఆవేశంతో ఊగిపోయే నానికి అతని తల్లి కండిషన్ పెడుతుంది. ఎవరిమీద కోపం వచ్చినా వారి పేరును పుస్తకంలో రాసుకొని శనివారం వరకు ఎదురుచూస్తాడు. ఆరోజు రాగానే వారికి బుద్ధిచెబుతుంటాడు. అటువంటి కథానాయకుడి జీవితంలోకి పరమ దుర్మార్గంగా వ్యవహరించే ఎస్ఐ వస్తాడు. ఆ పోలీసును హీరో కొడతాడు. తర్వాత పోలీసు అధికారి హీరోను ఎలా కనిపెట్టాడు? తర్వాత అతనిపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు? వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల పరంగా పోరు ఎలా జరిగింది? అనే విషయమే సరిపోదా శనివారం కథ.

సినిమాలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ దక్కింది. మాస్ యాక్షన్ కథతో దర్శకుడు ఆత్రేయ దీన్ని తెరకెక్కించాడు. సినిమా మొదటి భాగంలో ఎస్ జే సూర్య డామినేట్ చేస్తాడు. రెండో భాగంలో నాని డామినేట్ చేస్తాడు. హీరోయిన్ ప్రియాంక మోహన్ కానిస్టేబుల్ గా నటించింది. సంగీత దర్శకుడు జాక్స్ బిజాయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
జాక్స్ బిజాయ్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 'సరిపోదా శనివారం' మూవీకి స్పెషల్ అట్రాక్షన్‌గా మారాయని టాక్.. ఎన్టీఆర్ 'దేవర' మూవీ వచ్చేదాకా నాని 'సరిపోదా శనివారం' మూవీకి పెద్దగా పోటీ లేకపోవడంతో పాజిటివ్ టాక్ వస్తే... బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపడం ఖాయం. ఎస్ జే సూర్య నటనను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలను బాగా హైలైట్ చేశాయి. నానికి మంచి ఎలివేషన్లు ఇచ్చాడు దర్శకుడు. ఇవి తన కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిపోతాయంటున్నారు. ఈ సినిమా నాని ఇమేజ్ ను మరో మెట్టు ఎక్కించేలా ఉంటుంది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ తోపాటు విదేశాల్లో కూడా సరిపోదా శనివారం సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయని, నాని మరో హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నట్లే అంటున్నారు.












Click it and Unblock the Notifications